AP : మరో 30 ఏళ్లు పాటు జగనే సీఎం – వెలంపల్లి శ్రీనివాస్
- Author : Sudheer
Date : 17-12-2023 - 1:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఈసారి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని చాలామంది అభిప్రాయపడుతుంటే..మరో 20 నుండి 30 ఏళ్ల వరకు జగనే సీఎం గా ఉంటారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. విజయవాడలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం ఏర్పటు చేయగా..ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు ఇంఛార్జి దేవినేని అవినాష్ హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదు .. ప్రస్తుతం పదవులు అందని వారికి జగన్ మళ్లీ న్యాయం చేస్తారు.. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ లీగల్ సెల్ ద్వారా మాత్రమే జరిగింది . చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోవటం కోసం కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు.. వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పని చేశారు అని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకుంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది.. కుల, మత వ్యవస్థలకు వ్యతిరేకంగా జగన్ పాలన అందిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు వైసీపీ గెలుస్తుంది అని వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఏపీలో జగన్ సర్కారు మళ్లీ తిరిగి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేసారు.
Read Also : Oscar Challagariga : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫైనల్స్‌కు ‘ఆస్కార్ చల్లగరిగ’