Oscar Challagariga : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫైనల్స్‌కు ‘ఆస్కార్ చల్లగరిగ’
Oscar Challagariga : తెలుగు డాక్యుమెంటరీ "ఆస్కార్ చల్లగరిగ" మరో సంచలనం క్రియేట్ చేసింది.
- By Pasha Published Date - 01:42 PM, Sun - 17 December 23
Oscar Challagariga : తెలుగు డాక్యుమెంటరీ “ఆస్కార్ చల్లగరిగ” మరో సంచలనం క్రియేట్ చేసింది. ఫ్రాన్స్‌లోని కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫైనల్స్‌కు ఎంపికైంది. చిల్కూరి సుశీల్ రావు నిర్మించి, దర్శకత్వం వహించిన “ఆస్కార్ చల్లగరిగ” డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లోని కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. మన దేశానికి చెందిన ఆస్కార్ విజేత, ప్రముఖ గీత రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ తాజా విజయంపై ఈ డాక్యుమెంటరీని తీశారు. చంద్రబోస్ ఆస్కార్ అవార్డును గెల్చుకోవడాన్ని.. చల్లగరిగ గ్రామం ఎలా సెలబ్రేట్ చేసుకుందనే విషయాన్ని ప్రతిబింబించేలా ‘‘ఆస్కార్ చల్లగరిగ’’(Oscar Challagariga) డాక్యుమెంటరీని తీశారు. ఇప్పుడిది ఫైనలిస్ట్ కేటగిరీకి చేరుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఫైనల్స్‌లోకి ఎంటరైన వాటిలో.. అమెరికా, జర్మనీ, గ్రీస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, మాల్టా, ఇరాన్, చైనా, రష్యన్ ఫెడరేషన్, క్యూబా, గినియా-బిస్సౌ, కోస్టారికా, స్వీడన్, ఫ్రాన్స్, బల్గేరియా, చిలీ, బ్రెజిల్, స్విట్జర్లాండ్, స్పెయిన్, కొలంబియా, టర్కీ, ఇండియా, కెనడా, బెల్జియం దేశాల డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. ఫైనలిస్టుల జాబితాను డిసెంబర్ 16న అధికారికంగా ప్రకటించారు. డాక్యుమెంటరీ చిత్రనిర్మాత చిల్కూరి సుశీల్ రావు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం నుంచి బంగారు పతక విజేత. ఈయన పుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ కేరళ, ఐఐటీ మద్రాస్ అందించే ఫిల్మ్ మేకింగ్ కోర్సులను చేశారు. 1988 నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు.
Also Read: 61 Migrants Died : పడవ మునక.. 61 మంది మృతి
Related News
Vijay Mallya: విజయ్ మాల్యా కోసం ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ప్రమోటర్, మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.