HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Undavalli Arun Kumar Praises Pawan Kalyan

Pawan : ఏపీకి పవన్‌ కల్యాణ్‌ ఆశాజ్యోతి – ఉండవల్లి అరుణ్ కుమార్

Pawan : ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతిగా మారారని అభిప్రాయపడ్డారు. విభజన హామీలను సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం

  • Author : Sudheer Date : 18-02-2025 - 7:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Undavalli Arun Kumar Praise
Undavalli Arun Kumar Praise

ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు తన విలక్షణ అభిప్రాయాలను వ్యక్తం చేసే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ( Pawan Kalyan) ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతిగా మారారని అభిప్రాయపడ్డారు. విభజన హామీలను సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం అని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ సర్కారుపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉండటంతో, పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన దౌత్యనైపుణ్యంతో విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

Sudan War : 3 రోజుల్లో 200 మంది మృతి.. సూడాన్‌లో రక్తపాతం

రాష్ట్రానికి రావాల్సిన 75,000 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి అందుకునే బాధ్యత పవన్ కళ్యాణ్‌కు ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. కేంద్రంతో పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారని, ఆయన జోక్యం చేసుకుంటే విభజన హామీలను రాబట్టుకోవచ్చని పేర్కొన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పవన్‌ పేరుగాంచారని, ఆయన సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన విషయాన్ని కూడా వెల్లడించారు. విభజన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని, ఇప్పుడు ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు వ్యూహాలను ఎవ్వరూ ఊహించలేరని, అయితే పవన్ మాత్రం తన నిబద్ధతతో, ధైర్యంతో ముందుకు వెళ్లే వ్యక్తి అని కొనియాడారు. పవన్‌ తన రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి అవినీతికి గురికాలేదని, ఆయనదొక స్వచ్ఛమైన రాజకీయ జీవితమని ప్రశంసించారు.

Hydraa : హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్

అలాగే తాను వైసీపీ లో చేరబోతున్నారన్న వార్తలపై కూడా స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నానని, ఇకపై ఏ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్న తనకు ఇప్పుడు అలాంటి రాజకీయ వేడికి అవసరమేమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆనందంగా జీవిస్తున్నానని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Pawan Kalyan
  • undavalli arun kumar

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Avinash Reddy faces setback in Supreme Court

    వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd