Janasena : జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో చేరికల సందడి నెలకొంది. తాజాగా జనసేన పార్టీలోకి ఇద్దరు మాజీ
- By Prasad Published Date - 07:13 AM, Mon - 13 March 23

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో చేరికల సందడి నెలకొంది. తాజాగా జనసేన పార్టీలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరారు. మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావు ఆదివారం రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈదర హరిబాబు ఒంగోలు ఎమ్మెల్యేగా, ప్రకాశం జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా టీవీ రామారావు పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. సీనియర్ నేతలకు పార్టీలోకి స్వాగతం పలికారు. వీరితో పాటు భీమిలికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు చంద్రరావు, అక్కరమాని దివాకర్ కూడా పార్టీలో చేరారు. జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భీమిలి ఇన్‌ఛార్జ్ నాయకుడు పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.