Posani Krishna Murali: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని.!
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీకి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు.
- By Gopichand Published Date - 03:40 PM, Thu - 3 November 22

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీకి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. పోసానిని ఏపీ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పోసాని కృష్ణ మురళి వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ప్రచారం కూడా చేశారు. కాగా ఇటీవల సీఎం జగన్.. ప్రముఖ కమెడియన్ ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ వాదనలను బలంగా సమర్ధిస్తూ వస్తున్న పోసానికి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి దక్కడం గమనార్హం.