Secretariat : నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. నాగబాబు మంత్రి పదవి పై చర్చ..!
మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
- By Latha Suma Published Date - 02:30 PM, Mon - 16 December 24

Secretariat : ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాక జనసేన నేత కొణిదెల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పదవుల తుది జాబితా పై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాగబాబుకు క్యాబినెట్‌లో బెర్తు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, ప్రస్తుతం సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటన ముగిసిన అనంతరం నేరుగా సచివాలయానికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశంకానున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇదే ఫైనలా లేక.. మరో జాబితా ఉండబోతుందా అనేది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా మంత్రి పదవిని ఆశించారు.. పార్టీలో చేరే సమయంలో తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని కోటంరెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకున్నారట. దీంతో ఒక్క ఖాళీ తమ కోసమే ఎదురుచూస్తుందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు వారందరికీ షాక్ ఇచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.. చంద్రబాబు క్యాబినెట్ లో 25వ మంత్రి కాబోతున్నారు.
Read Also: Breast Cancer in Men : పురుషులుకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం..