TJR Sudhakar Babu : నారా లోకేష్ ఫై టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ ..
నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు
- By Sudheer Published Date - 05:01 PM, Sat - 2 December 23

ఏపీలో మళ్లీ టీడీపీ vs వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ నేతలంతా బిజెపి ని టార్గెట్ చేస్తూ రాగా..తాజాగా ఇప్పుడు లోకేష్ ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారు. రెండు నెలల గ్యాప్ తర్వాత లోకేష్ యువగళం యాత్ర ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ తరుణంలో లోకేష్ ..జగన్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు లోకేష్ ఫై విమర్శలు చేస్తున్నారు.
తాజాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు..లోకేష్ ఫై ఫైర్ అయ్యారు. నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు. సీఎంను తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా..? వెన్నుపోటు వీరుడు-స్కిల్ దొంగ చంద్రబాబే కదా అంటూ సుధాకర్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అని ఎన్నిసార్లు ప్రశ్నించినా లోకేష్ నుంచి సమాధానం లేదన్నారు. లోకేష్ మోకాళ్ళ యాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా, పాక్కునే, దాక్కునే యాత్ర చేసిన ఫలితం ఏమీ ఉండదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై నిప్పులు చెరిగారు. జగన్‌ను ఎందుకు ఓడించాలో పవన్ పది కారణాలు చెప్పాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకా?.. రైతు భరోసా ఇస్తున్నందుకా? అమ్మ ఒడి, చేయూత, ఆసరా.. ఇస్తున్నందుకా?.. ప్రజల్ని ఆదుకుంటున్నందుకా?.. గిట్టుబాటు ధరలు, బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నందుకా?.. ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. నువ్వు చేసే న్యాయం సినిమా ఇండస్ట్రీలో చెయ్ అంటూ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. మీ కుటుంబం అంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నారుగా.. అక్కడ ఉన్న కార్మికుల్ని ఆదుకోవాలని సూచించారు.
Read Also : Barrelakka Missing : అజ్ఞాతంలోకి బర్రెలక్క ..?