Barrelakka Missing : అజ్ఞాతంలోకి బర్రెలక్క ..?
కొల్లాపూర్ లో బర్రెలక్క గెలుపు అవకాశాలు ఉండటంతో పలు పార్టీల నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని..ఆమెను వారే దాచేసారని ఇలా ప్రచారం
- By Sudheer Published Date - 04:45 PM, Sat - 2 December 23
బర్రెలక్క (Barrelakka ) కనిపించడం లేదు..మొన్నటి వరకు సోషల్ మీడియా లో , ఎన్నికల ప్రచారంలో జోరు చూపించిన బర్రెలక్క ..పోలింగ్ తర్వాత నుండి కనిపించడం లేదు..ప్రస్తుతం ఇదే మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బర్రెలక్క కనిపించడం లేదని , ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిందని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొల్లాపూర్ లో బర్రెలక్క గెలుపు అవకాశాలు ఉండటంతో పలు పార్టీల నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని..ఆమెను వారే దాచేసారని ఇలా ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో ఓ యూట్యాబర్ ఆమెకు కాల్ చేసి ఎక్కడ ఉన్నది తెలుసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తన ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ కావటంతో తాను వరంగల్ వచ్చినట్లు బర్రెలక్క ఆ కాల్లో తెలిపింది. తన బెస్ట్ ఫ్రెండ్ యాక్సిడెంట్ గురి కావటంతో హుటహుటిన వరంగల్ వెళ్లాల్సి వచ్చిందని , హాస్పిటల్లో ఉండటం వల్లే ఎవరి ఫోన్ లిప్ట్ చేయలేకపోతున్నానని ఫోన్ లో స్పష్టం చేసింది. తాను మిస్సింగ్ అయ్యానన్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పింది. ఒకవేళ తాను మిస్ అయితే తన పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవారని … తాను ఎక్కడికి వెళ్లలేదని కావాలనే తనపై కొందరు దుష్ర్పాచారం చేస్తున్నారన్నారు. ఇక తనకు ఏ రాజకీయ పార్టీల నుంచి ఆఫర్స్ రాలేదని కూడా తెలిపింది. తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని.. తాను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.
Read Also : Black Friday Sale America : అమెరికాలో మొదలైన బ్లాక్ ఫ్రైడే సేల్..ఆఫర్లు మాములుగా లేవు
Related News
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది