Kolikapudi Srinivasarao : తిరువూరు టీడీపీ అభ్యర్థికి ఘోర అవమానం..
- Author : Sudheer
Date : 26-02-2024 - 11:48 IST
Published By : Hashtagu Telugu Desk
తిరువూరు టీడీపీ అభ్యర్థి (Tiruvuru TDP candidate)గా కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao) ను అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతి రాజధాని ఉద్యమంలో ఆయన కీలకంగా పని చేయడం..ప్రజలు సైతం ఆయనకు మద్దతుగా ఉండడం తో బాబు..ఆయనను ఖరారు చేసారు. ఈ ప్రకటన వచ్చిన 24 గంటలు కూడా గడవకముందే కొలికపూడి శ్రీనివాసరావు కు ఘోర అవమానం ఎదురైంది.
We’re now on WhatsApp. Click to Join.
టిడిపి అధిష్టానం శనివారం 94 అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన రాగానే టికెట్ దక్కించుకున్న నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ర్యాలీగా నియోజకవర్గంలో తిరిగారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై..తమ నేతకు ఘన స్వాగతం పలికారు. ఈ తరుణంలో తిరువూరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొలికపూడి శ్రీనివాసరావు సైతం తన పేరు ప్రకటించిన వెంటనే సంతోషంతో సింపుల్‌గా, సింగిల్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా తిరువూరు వీధుల్లో సైకిల్ తొక్కుకుంటూ తిరిగారు. అయితే ఆయన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. అమరావతి ఉద్యమంలో ఆయన వెంట వందలాది మంది రైతులు నడిచారు. కానీ ఆయన తిరువూరు వీధుల్లో నడుస్తుంటే కనీసం గుర్తుకూడా పట్టలేదు. ఎలాంటి హడావుడి లేకుండా వినూత్న ప్రచారం చేద్దామనుకున్న ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. దీంతో కొలికిపూడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరువూరులో టీడీపీ పరిస్థితి ఇది అంటూ వైసీపీ ట్రోల్స్ చేస్తున్నారు.