Tiruvuru MLA : వైసీపీ కి తిరువూరు ఎమ్మెల్యే రాజీనామా..?
- Author : Sudheer
Date : 11-01-2024 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ పార్టీ (YCP) లో వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తున్నారు. సర్వేల ఆధారంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) టికెట్స్ ఇచ్చేందుకు సిద్ధం అవ్వడం లేదు. వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. మూడో విడత కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలను క్యాంపు ఆఫీస్ కు రమ్మని పిలిచి సీటు విషయంలో క్లారిటీ ఇస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో టికెట్ రాని నేతలంతా పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీ కి గుడ్ బై చెప్పగా..తాజాగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి (Tiruvuru MLA Rakshana Nidhi ) సైతం (Resigns from YCP ) రాజీనామా చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. తిరువూరు వైసీపీ సీటు తనకి రాదని సమాచారం రావటంతో మనస్తాపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి రక్షణ నిధి కి కాకుండా స్వామిదాస్‌కు తిరువూరు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం డిసైడ్ అయ్యిందని సమాచారం. అందుకే రక్షణ నిధి పార్టీ కి రాజీనామా చేయాలనీ భావిస్తున్నాడట. శుక్రవారం తిరువూరు కు వచ్చి రక్షణ నిధి తన నిర్ణయం ప్రకటిస్తారని ఆయన వర్గం అంటుంది.
Read Also : Hanu Man First Review : ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ మాములుగా ఇవ్వలేదు