Tirupati Stampede : తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Tirupati Stampede : క్షతగాత్రుల వివరాలు మరియు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్(Separate control room)ను ఏర్పాటు
- By Sudheer Published Date - 09:30 AM, Thu - 9 January 25

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట (Stampede ) ఘటనపై ప్రభుత్వం (AP Govt) దృష్టి సారించింది. గాయపడిన క్షతగాత్రుల వివరాలు మరియు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్(Separate control room)ను ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ (Tirupati District Collector Venkateshwar) తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌ను 0877-2236007 నంబర్‌లో సంప్రదించవచ్చు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరం. మృతులలో ఐదుగురు మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. గాయపడిన వారికి రుయా ఆసుపత్రి మరియు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
BIG BREAKING – Tirupati Stampede : తొక్కిసలాట ఘటనలో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా క్షతగాత్రుల కుటుంబాలు, ఇతర ఆందోళన చెందిన వ్యక్తులకు సమాచారాన్ని అందిస్తారు. సహాయ చర్యలు మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు ప్రారంభమయ్యాయి. భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఎక్కడ జరిగాయో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.