Tiger Cubs: నంద్యాలలో పులి పిల్లలు.. వెటర్నరీ ఆసుపత్రికి తరలింపు..!
నంద్యాల జిల్లాలో పెద్ద పులి పిల్లలు (Tiger Cubs) ప్రత్యక్షమయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. పెద్ద గుమ్మడాపురం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని ఊరి చివర ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశించాయి.
- By Gopichand Published Date - 09:10 AM, Tue - 7 March 23

నంద్యాల జిల్లాలో పెద్ద పులి పిల్లలు (Tiger Cubs) ప్రత్యక్షమయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. పెద్ద గుమ్మడాపురం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని ఊరి చివర ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశించాయి. నాలుగు పెద్ద పులి పిల్లలను స్థానికులు గుర్తించారు. పులి పిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచకుండా.. తీసుకెళ్లి ఓ గదిలో ఉంచారు. ఈ పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చారు. కొందరు వీటితో సెల్ఫీలు దిగారు.
పులి పిల్లలు కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. ఈ పులి పిల్లలు గ్రామం వైపు ఎలా వచ్చాయని స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. పులి పిల్లలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలేయాలా?.. లేక జూకు తరలించాలా? అన్న సందేహం ఉంది. ఈ పిల్లలను జూకు తీసుకెళ్తే తల్లి పులి గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే అటవీ ప్రాంతంలో వదిలేసిన కుక్కలు, ఇతర జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎక్కడికి తరలించాలనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొంది.
Also Read: Raichur: రాయచూరులో విషాద ఘటన.. తల్లీ, పిల్లల సజీవదహనం
వాటిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టినా కదల్లేదు. దీంతో వాటిని బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పులి కూనలన్నీ ఆడవేనని, ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు జన్మనివ్వడం అరుదని అధికారులు తెలిపారు. కాగా, పులి పిల్లలు గ్రామంలోకి వచ్చాయంటే వాటి తల్లి సమీపంలోనే ఉంటుందని గ్రామస్థులు భయపడుతున్నారు.

Related News

Tirumala Hills: తిరుమల కొండపై గంజాయి కలకలం
తిరుమలకొండలోకి గంజాయి ప్రవేశించడంతో భక్తులు, అధికారులు ఆందోళన చెందారు.