HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Three Years Since Chandrababus Oath Challenged In The Assembly Then Proved Right Today

CM Chandrababu: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడు అసెంబ్లీ లో ఛాలెంజ్ చేసి.. నేడు నిజం చేశారు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడం, అధికార పార్టీ సభ్యుల హేళనలతో కలత చెందిన చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, "కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే తిరిగి వస్తా" అని శపథం చేశారు. ఈ పరిణామాలపై భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.

  • By Kode Mohan Sai Published Date - 05:15 PM, Tue - 19 November 24
  • daily-hunt
3 Years For Cbn's Challenge In Assembly
3 Years For Cbn's Challenge In Assembly

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజుకి సరిగ్గా మూడేళ్ల క్రితం (19-11-2021), టీడీపీ అధ్యక్షుడు, అప్పటి విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, నాటి స్పీకర్ తమ్మినేని సీతారామ్ పదేపదే ఆయన మైక్‌ను కట్ చేయడం, అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేల హేళనల నడుమ, చంద్రబాబు తీవ్ర అసహనంతో అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి సభ వాయిదా:

2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు అడ్డంకిగా మారడంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో నిరసన తెలుపుతున్న మిగితా టీడీపీ సభ్యులను తమ స్థానాల్లో కూర్చుని సంయమనం పాటించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ, సభలో గందరగోళం కొనసాగింది. దీంతో, మిగతా సభ్యులు కూడా సభా కార్యక్రమంలో అడ్డంకిగా మారడంతో 11:25 గంటలకు సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.

సభలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు:

నవంబర్ 19న మధ్యాహ్నం 12:13 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే, వ్యవసాయ శాఖ మంత్రి తాను హెరిటేజ్‌కు సంబంధించిన ఏదైనా అంశంపై మాట్లాడితే చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెబుతారని అనడంపై ప్రతిపక్ష నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పట్టుబట్టడంతో చంద్రబాబు మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇచ్చారు.

అధికార వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న అభ్యంతరకర వైఖరిని తాను ఎప్పుడూ చూడలేదని, తనను పదేపదే అవమానించారని అన్నారు. “తాను ప్రతిష్ట, గౌరవం కోసం ప్రయత్నిస్తానని తన భార్య పేరును కూడా లాగారని అంటుండగా…” చంద్రబాబు మైక్ కట్ అయ్యింది.

అంతకుముందు చంద్రబాబు సతీమణిని కించపరిచేలా వైసీపీ సభ్యులు వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు కలత చెందారు. దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన విమర్శలు చేయడంతో సభలో అవమానించేలా వ్యవహరిస్తున్నారని భావించారు.

మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడంతో సభలో మళ్లీ అడుగు పెట్టనని సవాలు చేశారు. అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని దానిని గౌరవ సభగా మార్చిన తర్వాత అడుగుపెడతానని నిష్క్రమించారు. ఆయన వెంట అచ్చన్నాయుడు మిగిలిన సభ్యులు వెళ్లిపోయారు. వైసీపీ పతనం మొదలైందని అచ్చన్నాయుడు వ్యాఖ్యినించడం వీడియోల్లో కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Telugu Desam Party (@jai_tdp)

చంద్రబాబు ఆవేదన: కుటుంబంపై దూషణ, భార్యపై అవమానం

ఆ తర్వాత మీడియాతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని తన కుటుంబ సభ్యులను దూషిస్తున్నారని ఆవేదక వ్యక్తం చేశారు.

2021లో వ్యవసాయం, రైతుల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి ఎస్ అప్పల రాజు గుజరాత్ కంపెనీలకు అనుకూలంగా రాష్ట్రంలోని కంపెనీలను విస్మరిస్తున్నారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు.

“తన హెరిటేజ్ కంపెనీ కోసం, నాయుడు సహకార డెయిరీలను పనికిరాని విధంగా చేయడానికి ప్రణాళికలు రచించారని” ఆరోపించారు. 1978 నుంచి టీడీపీ అధినేత వివిధ పార్టీలతో ఎలా పొత్తు పెట్టుకున్నారో, ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు.

సభ నుంచి నిష్క్రమించిన తర్వాత చంద్రబాబు తన భార్య భువనేశ్వరిపై పరుషమైన, అవమానకరమైన మాటల దాడి చేయడాన్ని ప్రశ్నించారు. ‘‘ రెండున్నరేళ్లుగా అవమానాలు భరిస్తూ ప్రశాంతంగా ఉన్నా.. ఈరోజు నా భార్యను కూడా టార్గెట్ చేశారు.. నా భార్య రాజకీయాల్లోకి కూడా రాలేదు.. నేనెప్పుడూ గౌరవంగా జీవించాను. ఇక భరించలేను” అని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ “డ్రామా”గా అభివర్ణించింది:

ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ డ్రామాగా అభివర్ణించింది. చేసిన వ్యాఖ్యలపై ప్రకటన చేసే అవకాశం కూడా ఇవ్వలేదని .. అందుకే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నానని, తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు అనడం వీడియోల్లో కనిపించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 Years For CBN's Challenge
  • ap assembly
  • CM Chandrababu
  • nara bhuvaneswari
  • nara lokesh
  • ys jagan

Related News

Investment In Ap

Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్‌ఏఈఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను

  • Lokesh Nellur

    Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • Hinduja Group

    Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • Nara Lokesh Blackbuck

    20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్

  • CM Chandrababu

    CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Latest News

  • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

  • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

  • IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd