Coconuts Price : కొబ్బరికాయల ధర డబుల్.. ఏపీ రైతుల ఆనందం
బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వర్తకులు కూడా కొబ్బరికాయలు(Coconuts Price) కొనేందుకు ఏపీకి వస్తుంటారు.
- By Pasha Published Date - 10:34 AM, Mon - 23 September 24

Coconuts Price : ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరికాయల ధరలు కొండెక్కాయి. వెయ్యి కొబ్బరికాయల రేట్లు కేవలం గత నెల రోజుల వ్యవధిలో రూ.9వేల నుంచి రూ.18వేలకు పెరిగిపోయాయి. ఈ రేట్లు వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగల నాటికి మరింత పెరిగి రూ.20వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఎందుకిలా ?
Also Read :PM Modi : ‘‘భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే’’.. ఎన్నారైల సమావేశంలో ప్రధాని మోడీ
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కొబ్బరికాయల దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో ఏపీకి చెందిన కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. కోనసీమ నుంచి హైదరాబాద్‌కు ఒక్కో లారీ నిండా కొబ్బరికాయల సప్లైకు దాదాపు రూ.25,000కుపైనే ఖర్చు అవుతోంది. ఒక్కో కాయ రవాణాకు రూపాయిన్నర దాకా ఖర్చవుతోంది. ఏపీ నుంచి పచ్చి కొబ్బరికాయలను తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సప్లై చేస్తుంటారు. కురిడీ కొబ్బరికాయలను ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వర్తకులు కూడా కొబ్బరికాయలు(Coconuts Price) కొనేందుకు ఏపీకి వస్తుంటారు. కొబ్బరికాయల ధరలు పెరగడంతో ఏపీ రైతులు ఆనందంలో ఉన్నారు. ఈసారి దేవుడి దయంతో మంచి లాభాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు.
Also Read :PM Modi : 15 టెక్ కంపెనీల సీఈవోలతో మోడీ భేటీ.. ‘మేడ్ బై ఇండియా’ గురించి చర్చ
విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు ?
విమానంలో తీసుకెళ్లకుండా బ్యాన్ చేసిన వస్తువులు/పదార్థాల జాబితాలో ఎండుకొబ్బరి, కొబ్బరికాయ కూడా ఉన్నాయి. చాలామంది విమాన ప్రయాణికులు హ్యాండ్ బ్యాగ్‌లో కొబ్బరికాయను తీసుకెళ్లాలని భావిస్తుంటారు. గుడిలో ప్రసాదంగా ఇచ్చే కొబ్బరికాయను తీసుకెళ్లాలని చాలామందికి ఉంటుంది. కానీ వాటిని తీసుకెళ్లేందుకు పర్మిషన్ లేదు. అయితే కొబ్బరి చిప్పను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటే.. కొబ్బరికాయ, ఎండు కొబ్బరి త్వరగా మంట అంటుకునే వస్తువులు. అందుకే, వీటిని బ్యాగ్‌లో పెట్టి విమానంలో తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. చెక్డ్ బ్యాగేజీలో కూడా వీటిని అనుమతించరు. కొబ్బరికాయ, ఎండిన కొబ్బరి చిప్పల్లో నూనె ఉంటుంది. వీటి నుంచే కొబ్బరి నూనె తయారు చేస్తారు. ఈ నూనెకు మంట అంటుకునే స్వభావం ఉంటుంది. విమానం లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని లోపలికి అనుమతించరు.