HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >They Are The Ones Who Donated Rs 1 Crore To Anna Canteens

Anna Canteens: అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం.. ఇచ్చింది వీరే..!

ఈ అన్న క్యాంటీన్ల‌కు చాలామంది త‌మ‌కు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది.

  • Author : Gopi Date : 14-08-2024 - 2:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anna Canteens
Anna Canteens

Anna Canteens: ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా కూట‌మి పార్టీ (టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ)లు ఘ‌న విజ‌యం సాధించిన అధికారంలోకి వ‌చ్చింది. అయితే ఎన్నిక‌ల‌కు ముందు కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే పెంచిన పెన్ష‌న్లు ల‌బ్దిదారుల‌కు అందిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా చంద్ర‌బాబు స‌ర్కార్ అన్న క్యాంటీన్ల‌ (Anna Canteens)ను అమ‌లు చేయ‌నున్న విష‌యం తెలిసిందే. రేపటి నుంచి కూట‌మి ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్లు మొద‌లుపెట్ట‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇందుకు త‌గ్గ ఏర్పాట్లు చేశారు అధికారులు.

అయితే ఈ అన్న క్యాంటీన్ల‌కు చాలామంది త‌మ‌కు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇందుకు సంబంధించి ఆయ‌న ఎక్స్ ఖాతా ద్వారా అభినందన‌లు తెలిపారు.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మి వ్రతంలో కలశం ఇలా ఏర్పాటు చేసుకోవాలి.. అందులో ఏమేమి వెయ్యాలో తెలుసా?

ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న అన్నక్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించడం అభినందనీయం. ఆ సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు నేడు సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును ఇవ్వడమే కాకుండా రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తం లో విరాళం… pic.twitter.com/fxxdmXJhfe

— N Chandrababu Naidu (@ncbn) August 13, 2024

సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు నేడు సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును ఇవ్వడమే కాకుండా రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తంలో విరాళం అందిస్తానని తెలపడం హర్షణీయం. ఈ సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పేద వాడికి అన్నం పెట్టే మంచి కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తున్నామని తెలిసి అన్ని వర్గాల వారూ అందులో భాగస్వాములు అవుతుండడం ఆనందంగా ఉంది. తమకు ఉన్నదాంట్లో కొంత సమాజం కోసం ఖర్చు చేయాలనే వారి ఆలోచనలు అందరికీ స్ఫూర్తి దాయకమ‌ని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1 Crore Donation
  • Andhrapradesh
  • Anna-Canteens
  • ap news
  • CM Chandrababu

Related News

Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ప్రస్తుతం ముంబైలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణతో పాటు ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల స

    Latest News

    • DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ నేటి నుంచి ‘ఖమ్మం’ జిల్లాలో పర్యటన

    • Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

    • APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Jnaneswari Missing: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన నేటికీ నెల.. పాపకు ఏమై ఉంటుంది?

    Trending News

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd