HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >These Are The Decisions Taken In The Meeting Of Cms Of Telugu States

Meeting Of CMs: ముగిసిన‌ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు ఇవే..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు (Meeting Of CMs) ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు.

  • Author : Gopi Date : 07-07-2024 - 12:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meeting Of CMs
Meeting Of CMs

Meeting Of CMs: తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు (Meeting Of CMs) ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు. ఈ సమాశానికి సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భ‌ట్టి హాజ‌రుకాగా.. ఏపీ మంత్రులు కందుల దుర్గేష్‌, స‌త్య‌ప్ర‌సాద్‌, బీసీ జ‌నార్ద‌న్ కూడా హాజ‌ర‌య్యారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో విభజన అంశాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్.. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ శనివారం జ‌రిగిన‌ సమావేశం నిర్ణయాలను ఉమ్మడిగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు అయిన మేము లోతుగా చర్చించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన చర్చించుకోవాలని, పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని డిప్యూటీ సీఎం భ‌ట్టి తెలిపారు.

Also Read: Prajabhavan : ముగిసిన బాబు – రేవంత్ ల సమావేశం..ఫైనల్ గా డిసైడ్ చేసింది ఇదే..

ఒక్క సమావేశంలోనే పరిష్కారం వస్తుందని మేము అనుకోవ‌టంలేదు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎస్ లతో పాటు ముగ్గురు అధికారులతో కమిటీ ఉంటుంది. రెండు వారాల్లో సమావేశం కావాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ అధికారుల కమిటీలో పరిష్కారం కానీ అంశాల కోసం మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా వీలుకాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించడం జరుగుతుంది. మంత్రుల స్థాయిలో కూడా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుంటే ముఖ్య‌మంత్రులు మ‌రోసారి భేటీ అవుతారు. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ క్రైమ్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈమేరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించిన‌ట్లు భ‌ట్టి తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఈరోజు తెలుగు జాతి హర్షించే రోజు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చంద్రబాబు లేఖ పంపించారు. ఈరోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని ఇద్దరు సీఎంలు చెప్పారు. ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. డ్రగ్స్ మహమ్మారి సమస్యలను ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని ఆయ‌న తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • cm revanth
  • CMs Meeting
  • hyderabad
  • Prajabhavan
  • telugu states

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

    • Kothagudem: భద్రాద్రి జిల్లాలో బాలికపై సామూహిక లైంగిక దాడి

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd