Subrahmanya Swamy : గోవుల మరణం వెనుక కుట్ర ఉంది : సుబ్రహ్మణ్యస్వామి
వృద్ధాప్యంలో మనుషుల ప్రాణాలు పోయినట్టే, వయసు మళ్లిన గోవులు కూడా చనిపోతాయని టీటీడీ చైర్మన్ ఎలా మాట్లాడుతారని ఆయన నిలదీశారు.అంతేకాదు, టీటీడీ చైర్మన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
- By Latha Suma Published Date - 04:48 PM, Fri - 18 April 25

Subrahmanya Swamy : బీజేపీ అగ్రనేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించారు. త్వరలో ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని మరోసారి ఆయన స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో మనుషుల ప్రాణాలు పోయినట్టే, వయసు మళ్లిన గోవులు కూడా చనిపోతాయని టీటీడీ చైర్మన్ ఎలా మాట్లాడుతారని ఆయన నిలదీశారు.అంతేకాదు, టీటీడీ చైర్మన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే సూత్రం మీకు కూడా వర్తిస్తుందని, అప్పుడు వృద్ధాప్య కారణంతో ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు వదిలేస్తారా? అని టీటీడీ చైర్మన్‌ను ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
Read Also: Vijayasai Reddy : సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యుల తీరుపై ఆయన ధ్వజమెత్తుతున్నారు. దీంతో ఆయన వేయనున్న పిటిషన్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు అని సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు.
Read Also: MMTS లో అత్యాచారం కేసులో సంచలన ట్విస్ట్..పోలీసులు సైతం షాక్