TDP Third List : ఇవాళే టీడీపీ మూడో లిస్ట్.. ఆ స్థానాల్లో ట్విస్టులు !?
TDP Third List : ఇవాళే టీడీపీ అభ్యర్థుల మూడో లిస్టును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.
- Author : Pasha
Date : 22-03-2024 - 9:36 IST
Published By : Hashtagu Telugu Desk
TDP Third List : ఇవాళే టీడీపీ అభ్యర్థుల మూడో లిస్టును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. టీడీపీ తొలి రెండు లిస్టులలోనూ మొత్తం అసెంబ్లీ అభ్యర్థులనే అనౌన్స్ చేసింది. ఈసారి విడుదల చేయబోయే లిస్టులో లోక్‌సభ అభ్యర్థులతో పాటు పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. బీజేపీతో పొత్తులో భాగంగా కేటాయించిన ఎంపీ సీట్లపైన కొత్త అనిశ్చితి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇవాళ ప్రకటించే టీడీపీ అభ్యర్థుల లిస్టులో కొత్త పేర్లు ఉంటాయని అంటున్నారు. తెలుగుదేశంపార్టీ ఫస్ట్ లిస్టులో 94, రెండో లిస్టులో 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రబాబు(TDP Third List) అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join
- ఏలూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఖరారైందని తెలుస్తోంది. ఏలూరు లోక్‌సభ సీటును ఈ దఫా బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. తొలుత గోపాల్ యాదవ్ అనే ప్రవాసాంధ్రుడి పేరు చంద్రబాబు పరిశీలనకు వచ్చిందని.. ఆ తర్వాత ఇప్పుడు మహేశ్ యాదవ్ పేరు ఖరారైందని చెబుతున్నారు.
- సీనియర్ నేత బీకే పార్థసారథిని హిందూపురం లోక్‌సభ స్థానంలో బరిలోకి దింపాలని టీడీపీ డిసైడ్ అయ్యిందట. గతంలోనూ ఇక్కడి నుంచి లోక్‌సభకు గెలిచిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.
Also Read :Jio World Garden : అంబానీయా మజాకా.. ‘జియో వరల్డ్ గార్డెన్’ విశేషాలివీ
- బాపట్ల ఎంపీ స్థానానికి తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీమంత్రి శమంతక మణికి ఈయన అల్లుడట.
- అనంతపురం లోక్‌సభ స్థానానికి ఇంకా అభ్యర్థి పేరు ఖరారుకాలేదు.
- కర్నూలులో కూడా బీసీ అభ్యర్థినే నిలపాలని చంద్రబాబు నిర్ణయించారట. బస్తిపాడు నాగరాజు అనే కురబ సామాజిక వర్గ నేతను ఆ స్థానానికి ఎంపిక చేసినట్లు సమాచారం. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు.
- నంద్యాల సీటుకు బైరెడ్డి శబరి ఎంపికైనట్లు తెలిసింది.
- అమలాపురం (ఎస్సీ) ఎంపీ స్థానానికి దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్‌ను ఖరారు చేశారని అంటున్నారు.ఈయన తెలంగాణ రాష్ట్రంలో అదనపు డీజీ హోదాలో పనిచేసి రిటైరయ్యారు.
- విజయనగరం లోక్‌సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరుతోంది.
Also Read :World Water Day 2024 : జలం ఉంటేనే జనం.. ‘బెంగళూరు సంక్షోభం’ నేర్పుతున్నది అదే!
- శ్రీకాకుళం అసెంబ్లీ సీటును గతంలో బీజేపీకి ఇచ్చారు. తాజా పరిణామాల్లో ఆ సీటును టీడీపీయే తీసుకుని దానికి బదులుగా ఎచ్చెర్ల సీటును బీజేపీకి కేటాయించినట్లు సమాచారం.
- తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేనలో హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు వినవస్తోంది.
- కాకినాడ ఎంపీ సీటుకు జనసేన తరఫున ఉదయ్ శ్రీనివాస్ పోటీచేస్తారని పవన్ ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది.