HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Ground Reality On Special Status

Special Status: ప్రత్యేక హోదాలో పచ్చి నిజం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 14వ ఆర్థిక సంఘం సిఫారసు అడ్డు అంటూ కేంద్రం చెప్పింది. కానీ , అది అబద్ధమని తాజాగా 14 వ సంఘం సభ్యుడు గోవిందరావు చెప్పిన దానిప్రకారం అర్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చెందిన మోసం మరోసారి బట్టబయలు అయింది.

  • Author : Hashtag U Date : 30-01-2022 - 4:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi and AP MAP
PM Modi and AP MAP

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 14వ ఆర్థిక సంఘం సిఫారసు అడ్డు అంటూ కేంద్రం చెప్పింది. కానీ , అది అబద్ధమని తాజాగా 14 వ సంఘం సభ్యుడు గోవిందరావు చెప్పిన దానిప్రకారం అర్ధం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చెందిన మోసం మరోసారి బట్టబయలు అయింది. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎలా సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో బహిర్గతం అయింది. మాటల్లో చూపించిన ప్రేమను ప్రధాని నరేంద్ర మోడీ చేతల్లో చూపడం లేదని స్పష్టం అయింది. రాష్ట్రానికి అండగా నిలవడానికి… హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా వంటి వాటిని నెరవేర్చడం కేంద్రానికి… మరీ ముఖ్యాంగా ప్రధాని మోదికి ఇష్టం లేదని తెలిపోయింది. పైకి చెబుతున్న 14వ ఆర్ధిక సంఘం నిబంధనలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏ మాత్రం అడ్డంకి కాదని మరోసారి నిరూపితం అయింది. సాక్షాత్తు ఆ 14వ ఆర్ధిక సంఘం సభ్యుడు… నేరుగా ప్రధానికి ఆర్ధిక సలహామండలి సభ్యుడుగా ఉన్న వ్యక్తే ఈ సంచలన సంగతులను బయట పెట్టారు.

పొలిటీషియన్ అబద్ధం చెప్పొచ్చు… మాట తప్పవచ్చు. కానీ అధికారికి ఆ అవసరం ఉండదు. అందుకు నిదర్శనమే ప్రధాని ఆర్ధిక సలహా మండలి సభ్యుడిగా ఉన్న ఎమ్. గోవిందరావు మాటలు. ఏపీకి హోదా ఇవ్వడానికి మోడీ సహా ఆర్ధిక మంత్రి జైట్లీ తదితరులు ఎన్ని సాకులు చెప్పినా నిజం దాగలేదు. రూల్ ప్రకారం అయితే అవుతుందని లేకుంటే లేదు అని చెప్పేయడం ఒక్కటే తెలుసు. అలాగే మోడీ ఆర్ధిక సలహాదారుల బృందంలో సభ్యుడైన గోవిందరావు ఏపీకి హోదాపై ఏ దాపరికం లేకుండా స్పందించారు.
గోవిందరావు ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి పలు వాస్తవాలను మరోసారి బయట పెట్టారు. 14వ ఆర్ధిక సంఘం ఎప్పుడూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదని కుండా బద్దలు కొట్టారు. “ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని మేము ఆంక్షలు పెట్టలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కేంద్రం ఇవ్వాలి అనుకుంటే ఎప్పుడైనా నిర్భయంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు” అని తేల్చి పారేశారు. అది కేవలం అధికారికంగా కార్యనిర్వాహక వర్గం తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రమేనని గోవిందరావు స్పష్టం చేశారు.

గోవిందరావు ప్రస్తుతం 14వ ఆర్ధిక సంఘం సభ్యుడు. అలాగే ప్రధాని ఆర్ధిక సలహామండలి వంటి కీలక విభాగంలో అధికారి. అలాంటి వ్యక్తి ఇప్పుడు విషయం ఇది అని చెప్పడంతో ఏపీ ఎదుగుదల ఎవరికి ఇష్టం లేదో తేలిపోయింది. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీ ఎందుకు అమలుకు నోచుకోలేదు తేటతెల్లం అయిపోయింది. ప్యాకేజీ పేరు చెప్పి సీఎం చేతులు కట్టేసింది ఎవరో బయటపడింది. హోదా ఇవ్వడం ఇష్టం లేకనే… ఇస్తే ఆంధ్రా ఎక్కడ అభివృద్ధిలో దూసుకు పోతుందో అన్న భయంతోనే రాష్ట్రానికి సంజీవని అయిన హోదా ఇవ్వడం కుదరదని ప్రధాని చెబుతున్నారన్న ఆరోపణలు నిజమని తేలిపోతుంది.

కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అడగకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న పలుకుబడితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు చూసిన కేంద్రం ప్రత్యేక హోదా వంటివి ఇస్తే అభివృద్ధిలో ఏపీ ఇచ్చే పోటీని తట్టుకుని నిలబడలేమని భావించే ఇలా సహాయనిరాకరణ చేస్తుందన్న వాదన నిజమే అనిపిస్తోంది. ప్రతి చిన్న విషయంలోనూ… రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి విషయంలోనూ మోడీ ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూనే ఉంది. చివరకు ఏపీ డీజీపీగా సమర్ధుడైన అధికారికి పొడిగింపు ఇచ్చే విషయంలో కూడా కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో ప్రస్తుతం చూస్తున్నాం. తెలంగాణలో అప్పటి డిజిపికి పొడిగింపు ఇచ్చిన ప్రభుత్వం ఏపీ విషయంలో కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడుతూనే ఉంది. సో..ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ చెబుతున్న మాటలు నిజం కాదన్నమాట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 14th finance commission
  • andhra pradesh government
  • andhra pradesh special statu
  • economic advisory council
  • pm modi

Related News

Putin Dinner

Putin Dinner: పుతిన్ విందుపై రాజకీయ దుమారం.. ఆ విష‌యంపై కాంగ్రెస్ అభ్యంతరం!

ఈ విందు తర్వాత పుతిన్ రష్యాకు తిరిగి బయలుదేరతారు. 23వ ఇండో-రష్యా సమ్మిట్‌లో పాల్గొనడానికి పుతిన్ భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ- పుతిన్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు.

  • Tri-Service Guard Of Honour

    Tri-Service Guard Of Honour: త్రి-సేవా గార్డ్ ఆఫ్ ఆనర్.. దాని అర్థం ఏమిటి?

  • Putin India Visit

    Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

  • PM Modi

    PM Modi: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కోసం ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసిన పీఎం మోదీ!

  • Putin Personal Toilet

    Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

Latest News

  • Pawan Kalyan: ఉస్తాద్‌లో పాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూస్తామా?

  • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

  • India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!

  • Brain Ageing: వయస్సు కంటే ముందే మెదడు వృద్ధాప్యానికి చేరుకుందా?

  • Telangana Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ సమ్మిట్‌.. అస‌లు ఎందుకీ స‌మ్మిట్‌, పూర్తి వివ‌రాలీవే!

Trending News

    • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

    • Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

    • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

    • Zero Balance Accounts: బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ!

    • Justin Greaves: టెస్టుల్లో గ్రీవ్స్ స‌రికొత్త ప్రపంచ రికార్డు.. నంబర్ 6లో బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచ‌రీ!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd