HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Termination Of Srivani Trust Key Decisions Of Ttd Governing Council

TTD : శ్రీవాణి ట్రస్టు రద్దు..టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..

తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.

  • Author : Latha Suma Date : 18-11-2024 - 5:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Termination of Srivani Trust.. Key decisions of TTD Governing Council..
Termination of Srivani Trust.. Key decisions of TTD Governing Council..

Srivani Trust : టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో సోమవారం నాడు పాలకమండలి తొలి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశం వివరాలను బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుందన్నారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం అన్నారు.

తిరుమలలో నేతలు రాజకీయ విషయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేస్తూ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేస్తున్నాం. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం అని టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

ఇకపోతే.. పలుమార్లు నిత్య అన్నదానంపై ఆరోపణలు, వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని, మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని, పాలకమండలి సమావేశంలో నిర్ణయించామన్నారు. శాశ్వత ఉద్యోగులకు రూ.15400, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.7530 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు. శారదా పీఠంకి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దుచేసి తాము స్వాధీనం చేసుకోవడం జరిగిందని, టూరిజం టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసినట్లు, ఈ టికెట్ల వ్యవహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు తమకు సమాచారం అందిందని టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు తెలిపారు.

Read Also: Assembly meetings : ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Sarvadarshanam
  • Srivani Trust
  • tirumala
  • tourism packages cancelled
  • ttd
  • TTD Chairman BR Naidu

Related News

Tirumala Laddu

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Tirumala Laddu  తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ

  • Tirumala Aksharabhyasam Akshara Govindam

    భక్తులకు శుభవార్త.. బాసర తరహాలో తిరుపతిలో అక్షర గోవిందం పథకం

  • Tirumala Devotees

    Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

Latest News

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd