HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tenders Issued For New Ap Bhavan Construction In Delhi

AP Bhavan In Delhi: ఢిల్లీలో ఏపీ భవన్ నూతన నిర్మాణానికి టెండర్లు!

దిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్' పేరుతో 11.53 ఎకరాల్లో నిర్మాణానికి అవసరమైన డిజైన్లకు టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియను ప్రారంభించింది.

  • Author : Kode Mohan Sai Date : 30-10-2024 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Bhavan In Delhi
Ap Bhavan In Delhi

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. “రీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్” పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లకు టెండర్లు పిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీలో ఏపీ భవన్ విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి భవన్ విభజనను ఖరారు చేశారు, దీనికి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు రాష్ట్రాలు కలిసి వినియోగిస్తున్నాయి.

కొత్త భవన నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం డిజైన్ ప్రక్రియను ప్రారంభించింది. గోదావరి, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడి హౌస్ వంటి మూడు ప్రదేశాల్లో భవన నిర్మాణానికి డిజైన్లు ఆహ్వానించారు. మొత్తం 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ డిజైన్లు కోరింది.

బుధవారం సాయంత్రం లోపు ఆసక్తి ఉన్న గుత్తేదారులు తమ ‘ఎస్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 28 లోపు తమ ప్రతిపాదనలు సమర్పించాలంటూ రహదారులు, భవనాల శాఖ విజయవాడ సర్కిల్ ఎస్ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణకు 8.245 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌కు 11.536 ఎకరాలు కేటాయించారు, దీనికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.

తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించబడ్డాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయించారు. నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డాయి. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.

దీంతో, ఢిల్లీలో తెలుగువారికి చిరునామాగా నిలిచే ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఎట్టకేలకు పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవడంతో, రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తాజాగా, ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆస్తులను 52:48 నిష్పత్తిలో ఏపీ మరియు తెలంగాణకు పంచారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Bhavan
  • AP Bhavan In Delhi
  • AP government
  • CM Chandrababu
  • Nara Chandrababu Naidu

Related News

Manoj Babu

Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశలో వారిని అనవసరమైన సామాజిక ఒత్తిళ్ల నుండి కాపాడటం సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని మంచు మనోజ్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఆటపాటలకు దూరమై

  • Ap Logo

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd