Davos Tour : దావోస్‌లో చంద్రబాబు వ్యూహాన్ని బయటపెట్టిన శ్రీధర్ బాబు
Davos Tour : ఏపీ ఒప్పందాలు చేసుకుని వాటిని ఇంకా ప్రకటించకూడదనే వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహరించారని ఆయన వెల్లడించారు
- Author : Sudheer
Date : 29-01-2025 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దావోస్(Davos)లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు(World Economic Forum conference)లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మంత్రివర్గ సభ్యులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఆయనతో కలిసి వెళ్లారు. పెట్టుబడులు రాబట్టడం ప్రధాన ఉద్దేశ్యంగా వెళ్లినప్పటికీ, ఏపీ టీమ్ పెద్దగా ఒప్పందాలు పొందలేదంటూ వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ విమర్శల గురించి చంద్రబాబు & టీమ్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
దావోస్ పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. అక్కడ రెండు రాష్ట్రాల బృందాలు కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించగా, ఏపీ ఖాళీగా తిరిగొచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కీలక విషయాలు వెల్లడించారు. ఏపీ ఒప్పందాలు చేసుకుని వాటిని ఇంకా ప్రకటించకూడదనే వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహరించారని ఆయన వెల్లడించారు.
Hardik Pandya: హార్దిక్ పై మండిపడ్డ టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్
శ్రీధర్ బాబు తెలిపిన ప్రకారం.. “ఏపీకి గ్లోబల్ కేపబిలిటీ ఉంది. చంద్రబాబుది బ్రాండ్ మెంటాలిటీ. ఆయన బ్రాడ్ థింకింగ్‌తో దావోస్‌కు వచ్చారు. ఏపీకి ఉన్న సముద్రతీరం, వనరులు పరిశ్రమల ఆకర్షణకు ముఖ్యమైనవి. ఏపీ ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది, కానీ వాటిని దావోస్‌లో బయటపెట్టడం లేదు” అని పేర్కొన్నారు. అంతేకాదు, లోకేశ్‌ను దీనిపై ప్రశ్నించగా, “ఈ ఒప్పందాల ప్రకటనలను ఏపీలోనే చేస్తాం” అని ఆయన చెప్పినట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఇక దావోస్‌లోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి కూడా శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైనస్ 8 నుంచి మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రతలలో తాము స్వెట్టర్లు వేసుకున్నప్పటికీ, చంద్రబాబు సాధారణ డ్రెస్సులోనే ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. 70 ఏళ్లు దాటినా చంద్రబాబు ఈ స్థాయిలో ఫిట్‌గా ఉండడం నిజంగా గమనించదగ్గ అంశమని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.