HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Low Pressure In The Bay Of Bengal Rains In Telugu States

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2026 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Imd Weather Update
Imd Weather Update

IMD Weather Update అనుకున్నదే జరిగింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌పై ఈ అల్పపీడనం ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నారు. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. అలాగే ఏపీలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి.

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఏపీపై ప్రభావం ఉండదని అంచనా
  • మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. బుధవారం నాటికి ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని.. అయితే ఆంధ్రప్రదేశ్‌పై ఈ అల్పపీడన ప్రభావం ఉండదని చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో శ్రీలంక, తమిళనాడులో మాత్రం వర్షాలు కురుస్తాయి అంటున్నారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఎలా ఉంటుందో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు.

వాస్తవానికి ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో తుఫాన్‌లు, వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడటం చాలా అరుదు అంటున్నారు. 1891 నుంచి 2024 వరకు కేవలం ఏడు తుఫాన్‌లు, వాయుగుండాలు మాత్రమే ఏర్పడ్డాయని చెబుతున్నారు.. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు అల్పపీడనం ఏర్పడిందని చెబుతున్నారు. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నెల 19 తర్వాత ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడుతుంది అంటున్నారు. ఒకవేళ ఏర్పడితే తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు కోస్తా జిల్లాల్లో సోమవారం నాడు పొగమంచు దట్టంగా కురిసింది. ఆ చివర శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు పొగమంచు తీవ్రత కనిపించింది. విజయవాడల చుట్టుపక్కల దట్టమైన పొగమంచు దెబ్బకు విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సోమవారం బిల్‌గేట్స్ వచ్చిన విమానం ల్యాండింగ్‌కు పొగమంచు ఆటంకంగా మారింది. విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి.. ఆ తర్వాత ల్యాండ్ అయ్యింది. అయితే ఇవాళ కూడా ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాల్లో పొగమంచు కురిసింది. అయితే ఎండల తీవ్రత కూడా పెరిగింది.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం కర్నూలులో ఏకంగా 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని చెబుతున్నారు. ఇక చలి తీవ్రత తగ్గి ఎండల తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత పెరిగింది.. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Weather Update
  • ap weather update
  • bay of bengal
  • Bay of Bengal cyclone
  • Bay of Bengal Weather
  • IMD Weather Update

Related News

    Latest News

    • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

    • HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !

    • మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

    • మణికొండలో పగిలిన పైప్‌లైన్‌.. కాలనీలను ముంచెత్తిన వరద

    • ఇళయరాజా కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd