Tirumala Stampede : తిరుమల తొక్కిసలాటపై చంద్రబాబు ట్వీట్
- Author : CS Rao
Date : 12-04-2022 - 1:55 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాటపై చంద్రబాబు స్పందించారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరుగా చూస్తోన్న టీటీడీ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. నిర్లక్ష్యం కారణంగా తోపులాట జరిగిందని ఆయన నిర్ధారించారు.ట్విట్టర్ వేదికగా భక్తులకు కలిగిన అసౌర్యంపై నాయుడు స్పందించారు. ‘తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాలు తీవ్ర ఆవేదన కలిగించాయని అన్నారు. లక్షలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే, కనీసం నీడ కల్పించాలి. తాగునీటి వసతి కల్పించాలి అన్న ఆలోచన టీటీడీకి రాకపోవడం దారుణమని ట్వీట్ చేశారు. తిరుమలను కేవలం ఆదాయ వనరు కోణంలోనే చూస్తూ, భక్తులకు దర్శనం, వసతి వంటి అంశాల్లో నిర్లక్ష్యం చూపించారు. కొండపైకి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా… శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. టీటీడీ వెంటనే మేలుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే… వారికి కనీసం నీడ కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి అన్న ఆలోచన టీటీడీకి రాకపోవడం దారుణం.(1/2) pic.twitter.com/sZRSEoCMLV
— N Chandrababu Naidu (@ncbn) April 12, 2022