CBN Kurnool: కర్నూలు టీడీపీ దూకుడు, చంద్రబాబు జోష్!
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. కర్నూలు వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హైకోర్టు బెంచ్ హామీని బలంగా వినిపించనున్నారు. మూడు రోజుల ఆయన పర్యటన సందర్భంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
- Author : CS Rao
Date : 16-11-2022 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. కర్నూలు వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హైకోర్టు బెంచ్ హామీని బలంగా వినిపించనున్నారు. మూడు రోజుల ఆయన పర్యటన సందర్భంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కే. ఈ. బ్రదర్స్ ను పక్కన పెట్టిన చంద్రబాబు వాళ్ల స్థానాన్ని భర్తీ చేసే నాయకులను తయారు చేశారు. వాళ్లకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీని బలోపేతం చేయనున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది మొత్తం జరుపుకోవాలని పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం వారానికి ఒక జిల్లాకు చంద్రబాబు వెళుతున్నారు. ఆ క్రమంలో కర్నూలు జిల్లా పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. బుధవారం నుంచి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!
జిల్లాలోని పత్తికొండ కు బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం రాత్రికి ఆదోనికి చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం ఆదోనిలో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎమ్మిగనూరులో రోడ్డు షో నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. గురువారం రాత్రికి కర్నూలులో బస చేస్తారు. శుక్రవారం నగరంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.
తొలి రోజు బహిరంగ సభ, రెండో రోజు రోడ్ షోలు, మూడో రోజు జిల్లాలోని పార్టీ నేతలతో సమీక్ష చంద్రబాబు జిల్లాల పర్యటన సందర్భంగా చేస్తున్నారు. ప్రత్యేకించి కర్నూలు రాజకీయంపై ఆయన పట్టు సాధించడానికి వ్యూహాలను రచించారు. ఆ సందర్భగా కేఈ, కోట్ల కుటుంబాల మధ్య అధికారంలో ఉన్నప్పుడు సయోధ్య కుదిర్చారు. కానీ, ఇప్పుడు కేఈ కుటుంబం చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు.
Also Read: Supreme Court: ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై `సుప్రీం` ఆరా
అందుకే , ప్రత్యామ్నాయంగా లీడర్లను అక్కడ తయారు చేశారు. రాబోవు ఎన్నికల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో స్వీప్ చేయడానికి అనువైన వాతావరణాన్ని చంద్రబాబు క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు రాజధానులు, అమరావతి రాజధాని గురించి ప్రత్యేకంగా కర్నూలు వేదికపై
ప్రస్తావించడం ద్వారా జగన్మోహన్ రెడ్దిని టార్గెట్ చేయనున్నారు.