HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leaders Protest In Tirupathi

TDP : తిరుప‌తిలో టీడీపీ బంద్‌ని అడ్డుకున్న పోలీసులు.. ప‌లువురు నాయ‌కులు అరెస్ట్‌

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు బంద్‌ నిర్వహించేందుకు ప్రయత్నించగా

  • Author : Prasad Date : 11-09-2023 - 8:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP calls for State bandh on Monday
TDP calls for State bandh on Monday

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు బంద్‌ నిర్వహించేందుకు ప్రయత్నించగా జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు భగ్నం చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, నాయకులు రమణ, జనసేన నగర అధ్యక్షుడు జె రాజా రెడ్డి తదితరులు ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు యత్నించారు. పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కిరణ్ రాయల్‌ను ఆదివారం అర్ధరాత్రి ఆయన ఇంటి వద్ద నిర్బంధించారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. తమిళనాడుకు చెందిన బ‌స్సు సర్వీసులు కూడా యథావిధిగా నడుస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ఈ రోజు సెలవు ప్రకటించాయి. ఈరోజు జరగాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎస్వీ యూనివర్సిటీ ప్రకటించింది. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామ‌ని యూనివ‌ర్సిటీ అధికారులు తెలిపారు. టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (TNSF) విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీకి జనసేన, ఎమ్మార్పీఎస్ సంఘీభావం తెలిపి బంద్‌లో పాల్గొంటున్నాయి. సీపీఐ కూడా టీడీపీకి మద్దతు తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu - Remand Report
  • nara lokesh
  • tdp
  • tirupathi
  • ysrcp

Related News

Balayya's NBK 112th film launched...

బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన చిత్రం (NBK112) గురువారం (జూన్ 25) లాంఛనంగా ప్రారంభం కానుంది. అమరావతిలో నేడు ఉదయం జరగనున్న ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక నిర్

  • Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

    Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Latest News

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd