TDP : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయం – మాజీ మంత్రి యనమల
2024 ఎన్నికల ముందే వైసీపీని రాష్ట్రం నుంచి గెంటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
- Author : Prasad
Date : 20-08-2023 - 6:10 IST
Published By : Hashtagu Telugu Desk
2024 ఎన్నికల ముందే వైసీపీని రాష్ట్రం నుంచి గెంటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీనికి సంకేతమే పంచాయితీలకు జరిగిన ఉపఎన్నికల ద్వారా వచ్చిన ఫలితాలని.. గెలుపుకోసం దిగజారి రాజకీయాలు చేసిన చరిత్ర వైసీపీదేనని ఆయన అన్నారు. ప్రజలు టీడీపీ పక్షాన నిలబడటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని… వైసీపీ అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక మంత్రులు నోరు పారేసుకుంటున్నారని యనమల ఆరోపించారు. బుర్రిపాలెంలో 1,526 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలవడమే ప్రజల్లో మార్పుకు నిదర్శనమని.. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ దుకాణం బంద్ అవడం ఖాయమన్నారు. భవిష్యత్తులో వైసీపీ గెలుపు అనేమాటే విని పరిస్థితి ఉండదని మంత్రులు గుర్తించుకోవాలని… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం, వైసీపీ కార్యాలయాలకు టూ లెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని యనమల జోస్యం చెప్పారు.