HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Govt 15 Lakh Golden Families Adopted By August 15

TDP Govt: కూట‌మి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!

పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

  • Author : Gopichand Date : 04-06-2025 - 8:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP Govt
TDP Govt

TDP Govt: జీరో పావర్టీ పీ4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గద‌ర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (TDP Govt) అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన పీపీపీ విధానానికి కొనసాగింపుగానే నేడు పీ4 విధానం తీసుకువచ్చామని అన్నారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… స్మార్ట్ ఏపీ ఫౌండేషన్‌ను స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌గా మార్చాలని నిర్దేశించారు.

అమరావతి పీ4కి కేస్ స్టడీగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణంలో 29 వేల మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి పీ4 పురోగతిని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు అధికారులు రూపొందించిన పీ4 లోగో డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.

Also Read: Virat Kohli: కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. విరాట్‌ను చూడాలంటే ఆగ‌స్టు వ‌ర‌కు ఆగాల్సిందే!

పీ4కు భాగస్వాముల సహకారం

పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా.. వీరిలో ఇప్పటివరకు 70,272 కుటంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. వీరిలో అత్యధికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh Govt
  • ap news
  • CM Chandrababu
  • Golden Families
  • TDP Govt

Related News

    Latest News

    • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

    • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

    • Condom Shortage: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • New Pensions : కొత్త పెన్షన్ల పై తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్

    • Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

    Trending News

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

      • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd