HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Counter On Visakha Summit

TDP Vizag Politics: విశాఖ సమ్మిట్ పై టీడీపీ కౌంటర్

విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న వేళ తెలుగుదేశం పదునైన అస్త్రాలను సంధించింది.

  • Author : CS Rao Date : 03-03-2023 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Counter On Visakha Summit
Tdp Counter On Visakha Summit

విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న వేళ తెలుగుదేశం (TDP) పదునైన అస్త్రాలను సంధించింది. పలు ప్రశ్నలను మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి కి విడుదల చేసింది. ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని రాజకీయ కోణాన్ని బయటకు తీశారు. వాటిని పరిశీలిస్తే..

1. పెట్టుబడుల స్వర్గధామం ఆయిన దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం కు వెళ్లక పోవడానికి సరైన కారణాలు ఏంటి?
దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో కనీసం ఇప్పటికైనా గుర్తించారా?

2. ఒక రాజధానినే నిర్మించుకోలేని లేని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలం?

3. జాకీ (Jockey) అనే అండర్వేర్ కంపెనీ రాష్ట్రంలో ఉండలేమని పారిపోతుంటే ఏమి చేశారు? కారణాలని విశ్లేషించి ఆ తప్పులను సరిదిద్దుకుని పునరావృతం కావన్న భరోసా ఇచ్చారా?

4. కియా కంపెనీకి అనుబంధ కంపెనీలు ఒక్కటీ తీసుకురాలేక పోయినందుకు ఆత్మ సమీక్ష చేసుకున్నారా?

5. హెచ్ఎస్‌బీసీ (HSBC) ఇక్కడ నుంచి వెళ్లకుండా ఆపే ప్రయత్నం కనీసం చేశారా?

6. లులూని ఇక్కడ నుంచి తరిమేశామని ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చెబుతారా?

7. అమర్‌రాజా బ్యాటరీస్ ను విజయవంతంగా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టామని సమ్మిట్‌లో గొంతెత్తి చెబుతారా?

8. భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను నాలుగేళ్లు శంకుస్థాపన చేయకుండా వదిలేసి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారు?

9. ఈ సమ్మిట్ కే 25 ఛార్టర్డ్ ఫ్లైట్స్ వస్తుంటే ప్రస్తుత ఎయిర్ పోర్టులో18 కి మాత్రమే పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని ఎలా చెబుతున్నారు? అదే భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించుకుని ఉంటే ఈ సమస్య ఉండేదా?

10. నాలుగేళ్లలో రాష్ట్రంలో అప్పటికే ఉన్న పోర్ట్‌లు తప్ప కొత్తగా ఒక్క పోర్ట్‌ను అయినా అభివృద్ధి చేశారా?

11. అసలు మీరు పారిశ్రామిక వేత్తలలో ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా పెట్టుబడుల సదస్సు పెట్టేంత సాహసం చేయడం వెనుక మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?

12. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులను ఆహ్వానించగలమా?

13. 2019 లో విశాఖలో దాదాపు యాభైవేల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 2, 3 వేలకు ఎందుకు తగ్గిపోయారు?

14. మీ ప్రభుత్వం వచ్చాక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక్క కంపెనీకి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?

15. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ఫిన్ కార్ప్ కంపెనీలు ఎందుకు ఇక్కడ నుంచి పారిపోయాయి?

16. అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన జరిగింది.. కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయినా మళ్లీ అదనంగా భూమి కేటాయించడం వెనుక రహస్యం ఏంటి?

17. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతీ నెలా మొదటి తేదీ నుంచి చివరి తేదీ దాకా ఎందుకు తీసుకుంటున్నారు?

18. తన ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాలను నమ్మి పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పగలరా?

19. సరైన ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తారా?

20. చిట్టచివరిగా మీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాక, ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో ఈ హడావుడి వెనుక కారణాలేంటి? ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి ఎంత మాత్రం కావని, రాష్ట్రంలో సగటు పౌరుని సందేహాలని… సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని గంటా తెలిపారు. ఇవే ప్రశ్నలను సమ్మిట్ వరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.

Also Read:  Rent Now, Pay Later: “రెంట్ నౌ, పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టండి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Counter
  • politics
  • Summit
  • tdp
  • Visakha
  • Visakhapatnam
  • ycp
  • ysrcp

Related News

LAND SCAM

Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

హైదరాబాద్ లో వంద‌ల కోట్ల భూమిని క‌బ్జా భాగోతం బ‌య‌ట‌ప‌డింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd