Chandrababu: ప్రజా ఉద్యమానికి పునాదులేసిన చంద్రబాబు
`ప్రజాఉద్యమం` తీసుకొస్తానని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. జిల్లాల పర్యటనకు ఆయన వెళ్లిన సందర్భంగా ఆ మేరకు ప్రజలకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే.
- Author : CS Rao
Date : 10-09-2022 - 2:07 IST
Published By : Hashtagu Telugu Desk
`ప్రజాఉద్యమం` తీసుకొస్తానని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. జిల్లాల పర్యటనకు ఆయన వెళ్లిన సందర్భంగా ఆ మేరకు ప్రజలకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజా వ్యతిరేకతను గమనించిన బాబు ఉద్యమాన్ని తీసుకురావడానికి స్కెచ్ వేశారు. ఆ క్రమంలో అమరావతి రైతులు మహాపాదయాత్ర తొలి దశను విజయవంతం చేశారు. పరోక్షంగా ఉద్యోగులకు మద్ధతు పలకడం ద్వారా ఇటీవల `ఛలో విజయవాడ` రూపంలో జగన్ మోహన్ రెడ్డి కి చమటలు పట్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రజా ఉద్యమ పంథాకు పదునుపెట్టారు.
రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ నిత్యం ఏదో ఒక రూపంలో పోరాడుతోంది. రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ ను ప్రశ్నిస్తూ అనేక సందర్భాల్లో ఇరుకునపెట్టారు. అంతేకాదు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని ` కామెంట్లు చేస్తూ `రూల్ ఆఫ్ లా` గడ్డుతప్పిందని రెండేళ్ల క్రితం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలోని సంఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. అందుకే, చంద్రబాబు ప్రజా ఉద్యమానికి అన్ని వర్గాలను సిద్ధం చేస్తున్నారు.
Also Read: AP Roads Video: రోడ్డు వేయాలంటూ ‘జగనన్న’ కు పోర్లు దండాలు!
మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డిపై అక్కడి రైతులు మూడేళ్లుగా పోరాడుతున్నారు. ఒక వైపు క్షేత్రస్థాయి ఉద్యమం మరో వైపు అలుపెరగని న్యాయం పోరాటం చేస్తోన్న విషయం విదితమే. భూములు ఇచ్చిన రైతులు న్యాయస్థానాల్లో గెలిచారు. అమరావతి టూ తిరుపతి వరకు చేసిన మహాపాదయాత్రకు ప్రజల నుంచి మద్ధతు లభించింది. దీంతో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ సర్కార్ మళ్లీ దాన్ని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రతిగా అమరావతి టూ అరసవల్లి మహాపాదయాత్రకు రైతులు సన్నద్ధం అయ్యారు. తొలి విడత పాదయాత్ర విజయవంతం కావడాన్ని గమనించిన ప్రభుత్వం మలివిడత యాత్రకు ససేమిరా అంటోంది. పాదయాత్ర చేసే రైతులకు భద్రత కల్పించడం కష్టమని ఏపీ పోలీసులు హైకోర్టుకు నివేదిక ఇవ్వడం గమనార్హం. దీంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన పాదయాత్రకు వెళ్లి తీరుతామని రైతులు భీష్మించారు.
Also Read: India’s Biggest Pappu: ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు.. అమిత్ షాపై ‘టీఎంసీ’ ట్రోలింగ్!
ఇక సీపీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 11వ తేదీన ఉద్యోగులు `మిలియన్ మార్చ్` కు సిద్ధం అయ్యారు. ఇప్పటికే పలుమార్లు క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ, టీచర్ల సంఘాల నేతలతో చర్చలు జరిపారు. కానీ, ప్రభుత్వానికి, టీచర్లకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో `చలో విజయవాడ` తరహాలో ఉద్యమానికి రంగం సిద్ధం చేశారు. ఇంకో వైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం ఏదో ఒక పిలుపునివ్వడం ద్వారా ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలని చంద్రబాబు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సమీప భవిష్యత్ లో చంద్రబాబు అంటే ఏమిటో జగన్ సర్కార్ కు మరోసారి తెలియబోతుందన్నమాట.