HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Amit Shah Plan Behind 3 Capitals Bill In Andhrapradesh

Amaravathi : అమ‌రావ‌తిపై `షా` మార్క్

రాజ‌కీయంగా ఏపీ బీజేపీ అమరావ‌తి ఉద్య‌మాన్ని వాడుకోవ‌డంలో కొంత వ‌ర‌కు విజ‌యం సాధించింది. అమిత్ షా రంగంలోకి దిగ‌డంతో మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగింద‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

  • Author : CS Rao Date : 22-11-2021 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రాజ‌కీయంగా ఏపీ బీజేపీ అమరావ‌తి ఉద్య‌మాన్ని వాడుకోవ‌డంలో కొంత వ‌ర‌కు విజ‌యం సాధించింది. అమిత్ షా రంగంలోకి దిగ‌డంతో మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగింద‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్ర‌జ‌లు కూడా అదే అనుకుంటున్నారు. ఇంత కాలం ఏ మాత్రం పున‌రాలోచ‌న చేయ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంది. షా ఆదేశాల మేర‌కు జ‌గ‌న్ ఆ విధంగా నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అంటున్నాడు.
రాజ‌ధాని విష‌యంలో బీజేపీ, వైసీపీని వేర్వేరుగా చూడ‌లేం. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ కేంద్రానికి తెలిసే చేస్తాడ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. రాజ‌కీయంగా కూడా అవ‌గాహ‌న‌తో టీఆర్ఎస్‌, బీజేపీ, వైసీపీ ముందుకు న‌డుస్తున్నాయ‌ని చెప్ప‌డానికి అనేక అంశాలు ఉన్నాయి. పార్ల‌మెంట్ వేదిక‌గా ఎన్డీయే ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుల‌ను అనేక సంద‌ర్భాల్లో టీఆర్ఎస్, వైసీసీ మ‌ద్ధ‌తు ఇచ్చాయి. ఒకానొక సంద‌ర్భంలో ఆ రెండు పార్టీలు ఎన్డీయేలో భాగ‌స్వామ్యం అవుతాయ‌ని కూడా చ‌ర్చ జ‌రిగింది.మ‌హాపాదయాత్ర చేయాల‌ని అమిత్ షా బీజేపీ నేత‌ల‌కు ఆదేశం జారీ చేశాడు. వాళ్లు రంగంలోకి దిగిన 24 గంట‌ల్లోనే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కు తీసుకున్నాడు. అంటే, జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకోబోయే నిర్ణ‌యం ముందే బీజేపీకి తెలుసు. అమిత్ షా కు ఖ‌చ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే, ఈనెల 21న మ‌హాపాద‌యాత్ర‌కు బీజేపీ కీల‌క నేత‌లు వెళ్లారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. అంతేకాదు, ఏపీకి ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకునే అంశాన్ని కూడా బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ప‌రిశీలించి ఉంటారు. అక్క‌డ నుంచి వ‌చ్చే ఆదేశాల మేర‌కు మాత్ర‌మే జ‌గ‌న్ కొత్త బిల్లు రూపుదిద్దుకుంది. ఆ విష‌యంలో ఎలాంటి సందేహం అవ‌స‌రంలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. వైసీపీ, బీజేపీ క‌లిసి అమ‌రావ‌తి రాజ‌ధాని అంశాన్ని కొత్త రూపంలోకి తీసుకెళ్లారన్న‌మాట‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 capitals
  • amaravati
  • ys jagan

Related News

Central government showering blessings on Amaravati

Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి కీలక ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2534 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్

    Latest News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

    • Wedding Season: మళ్లీ మొదలైన శుభ ఘడియలు.. పెళ్లి బాజాలు కు రెడీ

    • FIFA WC 2026: 200వ గోల్‌ తో చరిత్ర సృష్టించిన మెస్సీ

    • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd