TDP: కోనసీమలో టీటీపీ క్లీన్ స్వీప్.. వైసీపీ మంత్రుల తిరోగమన బాట
- By Latha Suma Published Date - 10:31 AM, Tue - 4 June 24
Elections Counting: ఏపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ సీనియర్లు, మంత్రులు తిరోగమన బాటలో పయనిస్తున్నారు. ధర్మాన, బుగ్గన, రోజా, పెద్దిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, బొత్స తదితర మంత్రులందరూ వెనకంజలోనే ఉన్నారు. వైసీపీ నేతలు, మంత్రులు కొందరు తొలి రౌండ్ ఫలితాల తర్వాత కౌంటింగ్ కేంద్రాల నుంచి నిరాశతో బయటకు వెళ్లిపోతున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి స్వీట్లు పంచుకుని, బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: Madhavi Latha : హైదరాబాద్ లీడ్‌లో మధవీలత