HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Suspended Jana Sena For Arranging Flexi At Chicken Betting

Janasena: కోడి పందాల వ‌ద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడ‌ని పార్టీ నేత‌ను స‌స్పెండ్ చేసిన జ‌న‌సేన‌!

అయితే ఇలా స‌స్పెండ్ చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే త‌ప్పేముంద‌ని కొంద‌రు పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

  • Author : Gopi Date : 16-01-2025 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena
Janasena

Janasena: ఏపీలో సంక్రాంతి సంద‌డి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సంక్రాంతి కూట‌మి ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగింది. సంక్రాంతి సంద‌ర్బంగా ఉభ‌య గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. అయితే ఈ సంక్రాంతి సంద‌ర్భంగా ఏపీలో దాదాపు రూ. 2000 కోట్ల మేర పందాలు జ‌రిగిన‌ట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి. ఈ పండుగ సంద‌ర్భంగా లోక‌ల్ లీడ‌ర్లు కూడా త‌మకు ఉన్న వాల్యూ ఏంటో చూపించాల‌ని అనుకుంటారు.

ఈ ఆలోచ‌న‌తోనే చాలా మంది కూట‌మి పార్టీ నాయ‌కులు కోడి పందాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల వ‌ద్ద పార్టీ పేరుతో త‌మ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇలా కోడిపందాల వ‌ద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జ‌న‌సేన (Janasena) నేతకు పార్టీ భారీ షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. కోడి పందాల శిబిరాల వద్ద జనసేన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా)ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Also Read: AI Cameras At Liquor Shops: మద్యం దుకాణాలలో AI కెమెరాల ఏర్పాటుపై నిషేధం.. కారణమిదే?

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద నిర్వహించిన కోడి పందాలు ప్రాంగణంలో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరమ‌ని అందులో పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన మిమ్ములను (జ‌న‌సేన నేత రాజా) పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడమైనదని అందులో రాసుకొచ్చారు. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో రాజాకు ఎటువంటి అధికారికమైన సంబంధం లేదు అంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ కాన్ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్ హెడ్ వేముల‌పాటి అజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

అయితే ఇలా స‌స్పెండ్ చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే త‌ప్పేముంద‌ని కొంద‌రు పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీలో పార్టీ ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతుండ‌టంతో ఇలాంటి సంస్కృతి వ‌ద్ద‌ని ప‌వ‌న్ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను గ‌ట్టిగా హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. పార్టీ నియ‌మాలు ఉల్లంఘించిన వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు కూడా తీసుకోనున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ గ‌తంలోనే ప్ర‌క‌టించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap politics
  • DCM Pawan Kalyan
  • Janasena
  • kodi pandalu
  • penamaluru

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd