Viveka murder case: వివేకా హత్య కేసులో ‘ఏపీ సర్కార్, CBI’కి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని..
- Author : Hashtag U
Date : 19-09-2022 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని.. ఆయన కుమార్తె సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ‘‘సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి కనిపించటం లేదు. కేసులో నిందితులుగా ఉన్న వారంతా బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరించి.. సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేస్తున్నారు’’ అని సునీత తరఫు న్యాయవాది ధర్మాసనానికి వాదనలు వినిపించారు. దీంతో పిటిషన్‌లో సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది