AP : మండుటెండలో చల్లటి వార్త.. వేసవి సెలవుల ప్రకటన
ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది
- Author : Sudheer
Date : 02-04-2024 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
మండుటెండలో స్కూల్ (School) విద్యార్థులకు చల్లటి వార్త తెలియజేసింది ఏపీ ప్రభుత్వం. స్కూళ్లకు వేసవి సెలవులు (Summer Holidays) ప్రకటించేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 దాటితే నిప్పుల కుంపటిలా మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులకుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ సర్కార్ విద్యార్థులకు చల్లటి కబురు తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
మార్చి 18 నుంచి ఏపీ ప్రభుత్వం ఎండల కారణంగా ఒంటిపూట బడులను నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
Read Also : Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు