Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్నా.. శ్రీరెడ్డి సంచలనం
మానసికంగా ఇంకా ఇంకా ఇలా దెబ్బకొడుతూ.. ఆత్మ వంచన చేసుకొని మన పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటే నమ్మే వారు మనలో ఎవరైనా వున్నారా?
- By Gopichand Published Date - 10:11 PM, Sat - 18 January 25

Sri Reddy: వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. నటి, వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి (Sri Reddy) పార్టీపై ఓ వీడియో విడుదల చేసింది. అందులో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. ఈ రోజు సాక్షి పత్రిక ఫ్రంట్ పేజీలో వచ్చిన తెలుగుదేశం పార్టీ అడ్వర్టైజ్మెంట్ చూసి విరక్తితో రాజీనామా చేశారు పార్టీ అధికార ప్రతినిధి కె.రవిచంద్ర రెడ్డి. జగన్ కు డబ్బులే ప్రధానం అని, అతనికి విలువలు, విశ్వసనీయత లేవని తన సన్నిహితులతో పేర్కొన్నట్లు సమాచారం అని సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరోవైపు వైస్సార్ అభిమాని పేరుతో ఇదే సాక్షిలో వచ్చిన టీడీపీ యాడ్‌ను పైసల కోసం ఎంతైనా దిగజారుతారా అని ప్రశ్నిస్తూ వ్రాసిన ఆవేదన వాట్సాప్ ద్వారా వైరల్ అవుతోంది. గోరు చుట్ట మీద రోకటి పోటులా.. టీడీపీ కోటి సభ్యతాలు పూర్తి చేసుకొన్న పండగ అన్నట్లుగా.. శ్రీరెడ్డి వీడియో చేస్తూ.. రవిచంద్రా రెడ్డి లాంటి వారు ఈ సమయంలో పార్టీని వదిలి వెళితే మరింత మానసిక ధైర్యాన్ని శ్రేణులు కోల్పోతాయని, కనీసం మాట్లకపోయినా గమ్మున ఒక మూల పార్టీలో పడుండమని ప్రాధేయపడడం కలకలం రేపుతోంది.
జగనన్న పైసలు సంపాయించుకోవాలి . మనం ఆయన విలువలు గురించి మాట్లాడుకోవాలి. ఇన్నాళ్లూ మన వైసీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియా అని ముద్ర వేశాం. కానీ ఈనాడు వాళ్లు చివరి వరకు పోరాడారు. ఏ రోజూ రామోజీరావు మడమ తిప్పలేదు. విలువలు కోల్పోలేదు. మన ఘోర ఓటమిని చూసి భీష్ముడిలా మరణించాడు. ఇవ్వాళ ప్రతిపక్షం కూడా లేకుండా సచ్చిన పాములా 11తో పడి వున్న మన పార్టీని మానసిక స్థైర్యం కోల్పోయేలా మన సాక్షి. పైసల కోసం అమ్ముడుపోయింది. ఇదా.. మన విలువలు, విశ్వసనీయత? అదేమన్నా కనీసం ప్రభుత్వ ప్రకటనా? ప్రధాన శత్రు పార్టీ అయిన తెలుగుదేశం యాడ్. ఎంత డబ్బు కావాలి? ఆ పైసలు తీసుకొని మన కార్యకర్తలకు ఏమన్నా బీమా చెయ్యిస్తామా? ఎందుకు ఇంత పైసల కక్కుర్తి? ఎన్ని వేల కోట్లు అయితే సరిపోతుంది?
Also Read: Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
లోకేశ్ నేతృత్వంలో కోటి పార్టీ సభ్యత్వాలతో ఘన నివాళి అని, దాని సభ్యత్వ నమోదుల్లో రికార్డుల గురించి, వాళ్ల కార్యకర్తల కోసం ఇచ్చే ప్రమాద బీమా గురించి ఇచ్చిన యాడ్‌ను ప్రచురించి, వైసీపీని నమ్ముకొన్న మన కార్యకర్తలకు ఏ సందేశం ఇచ్చారు? అని శ్రీరెడ్డి ప్రశ్నించారు. మానసిక స్థైర్యం కోల్పోయిన మన పార్టీ కార్యకర్తలను తలెత్తుకోలేకుండా.. మానసికంగా మరింత దెబ్బ కొట్టింది మన సాక్షి కాదా? యాడ్ కోసం ఇంత దిగజారాలా? ఎన్ని కోట్లు ఇస్తే పోయిన మన విలువలు, విశ్వసనీయత తిరిగివస్తుంది? ఆ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి, ఇన్నాళ్లూ సాధించి, మాకేదో వారు భూమి మీద శత్రువులు అన్నట్లు చేసి, ఇవ్వాళ ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ముష్టి యాడ్ డబ్బులకు చెయ్యి చాచి, డబ్బుల కోసం ఎంతైనా దిగజారే పార్టీ అని తలెత్తుకోలేకుండా చేశారు.
మానసికంగా ఇంకా ఇంకా ఇలా దెబ్బకొడుతూ.. ఆత్మ వంచన చేసుకొని మన పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటే నమ్మే వారు మనలో ఎవరైనా వున్నారా? సాక్షిని ప్రారంభించిన కొత్తలో అతి తక్కువ ధర పెట్టి, అన్ని పత్రికలను ఆ ధరకు అమ్మమని సవాల్ చేసి, మళ్లీ వాటి ధరలకు సమానంగా పెంచింది మనమే. ఇవ్వాళ వాళ్లు పాటించే విలువలు పాటించక దిగజారింది మన సాక్షినే. ఛీ.. ఇందుకా ఈ రోజు సాక్షిని కొన్నది, ఇన్నాళ్లు కొని అచ్చేసిన చెత్త అంతా చదివింది అని కళ్లు తెరిచేలా చేసినందుకు జగనన్నకు కృతజ్ఞతలు అంటూ వైసీపీ కార్యకర్తగా సిగ్గుపడుతూ మీ వెఎస్సార్ అభిమాని అంటూ శ్రీరెడ్డి వీడియో విడుదల చేసింది.