Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఫిబ్రవరి 26కు వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది
- Author : Praveen Aluthuru
Date : 12-02-2024 - 5:13 IST
Published By : Hashtagu Telugu Desk
Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ అంశంపై వాదించాల్సి ఉంది. అయితే ఆయన ఈరోజు అందుబాటులో లేరని చంద్రబాబు తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. దీంహో న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ మంజూరు కేసుని రెండు వారాల పాటు వాయిదా వేయాలని న్యాయవాది సాల్వే కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్, న్యాయవాది మహ్ఫూజ్ అహ్సాన్ నజ్కీలు హైకోర్టు తీర్పుపై అప్పీలును విచారించేందుకు ముందస్తు తేదీని నిర్ణయించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కాగా..ఈ అంశాన్ని ఫిబ్రవరి 26న విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు రూ.371 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ గతేడాది సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేశారు. అయితే ఈ ఆరోపణల్ని చంద్రబాబు వర్గం ఖండించారు. అయితే హైకోర్టు తీర్పును పక్కన పెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌లో చంద్రబాబు కేసును ప్రభావితం చేస్తాడని ప్రభుత్వం తరుపు న్యాయమూర్తులు ఆరోపించారు. ఇదిలా ఉందిగా నారా చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకుని అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.
Also Read: Vastu Tips: మనం తెలిసి చేసే ఈ పొరపాట్లే దరిద్రానికి హేతువులు అని మీకు తెలుసా?