Hydra In VIjayawada : విజయవాడ లోను ‘హైడ్రా’ తరహా వ్యవస్థ రావాల్సిందేనా..?
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థను విజయవాడ లో కూడా సీఎం చంద్రబాబు తీసుకరావాలని డిమాండ్ చేస్తున్నారు
- By Sudheer Published Date - 02:07 PM, Wed - 4 September 24
తెలంగాణ (Telangana) లో సీఎం రేవంత్ (CM Revanth Reddy) తీసుకొచ్చిన ‘హైడ్రా’ వ్యవస్థను ఇప్పుడు విజయవాడ లో కూడా తీసుకరావాలని ప్రజలు కోరుతున్నారు. చెరువులు కబ్జా చేసి ఇళ్ల నిర్మాణం చేయడం వల్ల ఈరోజు విజయవాడ నగరం జలమయంగా మారిందని వాపోతున్నారు. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. దాదాపు రెండు రోజుల పాటు నీటిలోనే ఉన్న ప్రజలు ..ఇప్పుడెప్పుడే బయటకు వస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం పూర్తి స్థాయిలో అందక ఎవరైనా దాతలు సాయం చేస్తారో అని ఎదురుచూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంత జలమయం కావడానికి ప్రధాన కారణం బుడమేరు వాగు (Budameru Floods) ను కబ్జా చేయడమే అని అంటున్నారు. 2005లో 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో విజయవాడ (VIjayawada ) మునిగింది. దీంతో దాన్ని పోలవరం కుడికాలువకు లింక్ చేసి, రెగ్యు లేటర్ ఏర్పాటు చేశారు. తద్వారా బుడమేరుకు ప్రవాహం తగ్గడంతో ఆక్రమణదారులు గద్దల్లా వాలారు. ఆ వాగు కనిపించకుండా కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు. తాజాగా ప్రకాశం బ్యారేజీలో భారీ ప్రవాహం ఉండటంతో కుడికాలువ నీటిని పైకి ఎగదోసింది. దీంతో బుడమేరుకు నీటిని వదలడంతో బెజవాడ ‘జలవాడ’ అయ్యిందని వాపోతున్నారు.
2009లో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనకు ముందు బుడమేరు ప్రవాహం అప్పటి కంకిపాడు నియోజక వర్గంలో ఉండేది. కంకిపాడు అసెంబ్లీలోనే విజయవాడ రూరల్ నియోజక వర్గంలో కొన్ని ప్రాంతాలు ఉండేవి. గుణదల ప్రాంతంలో బుడమేరు కాల్వ గట్లపై ఉన్న ఆక్రమణలు తొలగించడం, ఎనికేపాడు, నిడమానూరుప ప్రాంతాల్లో ఉన్న యూటీలను తొలగించి బుడమేరు స్వరూపాన్ని వరద ముంపు లేకుండా చేయాలంటే భూ సేకరణ చేయాల్సి వస్తుందనే కారణంతో ఆ పనులు అర్థాంతరంగా ఆపేశారు. అప్పట్లో ఈ పనుల కోసం దాదాపు రూ.8.5కోట్ల రుపాయల నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా యూటీలను సరిచేయలేకపోయారు.
2009లో వైఎస్సార్ మరణం తర్వాత బుడమేరు అంశం పూర్తిగా తెరమరుగైపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. 2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జలవనరుల శాఖకు మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమా నేతృత్వం వహించారు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజక వర్గంలోనే బుడమేరు ప్రవాహం మొదలవుతుంది. 2004-09 మధ్యలో పోలవరం కుడి కాల్వ నిర్మాణం చాలా భాగం పూర్తైంది. రాష్ట్ర విభజన తర్వాత భూసేకరణ పూర్తి చేసి మిగిలిన కాలువ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణాకు తరలించారు. అదే సమయంలో బుడమేరు ఆధునీకీకరణను మాత్రం విస్మరించారు. కుడి కాల్వ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కుల డిశ్చార్జిగా అనుగుణంగా తీర్చిదిద్దలేకపోయారు.
2019-24 మధ్య బుడమేరు అంశాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 2010 నుంచి సింగ్ నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు వెలియడంతో విజయవాడ నగరంలో మరో కొత్త ప్రాంతం విస్తరించింది. వేల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు వెలువడం తో 20ఏళ్ల తర్వాత దాని ఫలితాన్ని విజయవాడ ప్రజలు అనుభవిస్తున్నారు.
ఈ జలవిలయాన్ని కన్నులార చూసిన విజయవాడ వాసులు ..హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థను విజయవాడ లో కూడా సీఎం చంద్రబాబు తీసుకరావాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తే తప్ప ఈ జలవిలయానికి అడ్డు పడదని అంటున్నారు. మరి చంద్రబాబు హైడ్రా ను తీసుకొచ్చే ధైర్యం చేస్తారా..? లేదా అనేది చూడాలి.
Read Also : Vinayaka Chavithi 2024: గణపతిని ఏ సమయంలో ప్రతిష్ఠించాలి.. పూజ విధానం ఇదే..!
Related News
YS Sharmila : కేంద్రం నుంచి సాయం తెస్తారా?..ఎన్డీయే నుంచి తప్పుకుంటారా?: షర్మిల
YS Sharmila questioned CM Chandrababu : విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఈరోజు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు.