HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Shock For Jagan Key Ysrcp Leader Joins Tdp

జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

  • Author : Vamsi Chowdary Korata Date : 18-12-2025 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Btechravi
Btechravi

Pulivendula politics : పులివెందులలో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్‌కు సన్నిహితులైన దంతులూరి కృష్ణ అనుచరుడు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సభలో జగన్‌ను ‘కన్నడ బిడ్డ’ అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డిలు జగన్‌ను విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాము అన్నారు బీటెక్ రవి.

  • పులివెందులలో వైసీపీకి ఎదురు దెబ్బ
  • టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • టీడీపీలో చేరిన దేవర్ల చంద్రశేఖర్‌రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడు దంతులూరి కృష్ణ ప్రధాన అనుచరుడు దేవర్ల చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరారు. అలాగే వైఎస్సార్‌సీపీకి చెందిన చిన్నతాజ్‌ క్యాట్‌ గౌస్‌తో పాటు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వేంపల్లెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి.. వైఎస్సార్‌‌సీపీ నేతలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో పులివెందులలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

జగన్ కడప బిడ్డగా కాకుండా కన్నడ బిడ్డగా మారిపోయారని మాజీ సీఎం జగన్‌పై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే ఉంటూ, అధికారం పోగానే బెంగళూరు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. అందుకే కన్నడ బిడ్డ అంటూ సెటైర్లు పేల్చారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో డబ్బు సంపాదించి, అధికారం కోల్పోయాక బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు.

పులివెందుల నియోజకవర్గాన్ని జగన్‌ గత ఐదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో ఏ రంగంలోనూ అభివృద్ధి చేయలేదన్నారు శ్రీనివాసరెడ్డి. కాలేటి వాగు ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిందని.. దీనిని పూర్తి చేయడానికి నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్‌ రవి చర్యలు చేపట్టారన్నారు. టీడీపీ వేంపల్లెలో నిర్వహించిన సభతో జగన్‌ గుండెల్లో దడ మొదలై ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవాలంటే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అన్నింటా గెలవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ విధానాలను ఎండగట్టడంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పనిచేయాలని.. అందరు కలిసి సమన్వయంతో ముందుకు సాగాలి అన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh politics
  • Pulivendula
  • Pulivendula politics
  • Resign For YSRCP
  • tdp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Bill Gates to visit Amaravati Today

    చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

  • Ap Budget 2026–27

    నేడు ఏపీ బడ్జెట్..

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd