Viveka Murder : చిన్నాన్నను బంధువులే హత్య చేసారు – వైస్ షర్మిల
- Author : Sudheer
Date : 15-03-2024 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
చిన్నాన్నను బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్న… హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని వాపోయింది వైస్ షర్మిల (YS Sharmila ). మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) ఐదో వర్ధంతి సందర్భంగా కడపలోని జయరాజ్ గార్డెన్‌లో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేకా ఆత్మీయులు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా వైస్ షర్మిల మాట్లాడుతూ..చిన్నాన్న మరణం నమ్మలేని నిజమని.. ఆఖరి సారి మా ఇంటికి వచ్చి కడప లోక్ సభకు పోటీ చేయాలని అడిగారు. 2 గంటలు ఒప్పించే ప్రయత్నం చేశారు. అన్నీ అనుకూలిస్తే చేస్తాలే అని చెప్పే వరుకు చిన్నాన్న వెళ్లలేదని షర్మిల వాపోయారు. బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని కానీ హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. హత్యకు గురైన చివరి క్షణం వరకు బాబాయ్ వైసీపీ కోసమే పని చేశారని ..జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్షిలో పైన వైఎస్ ఫొటో ఉంటుందని… కింద వైఎస్ తమ్ముడి వ్యక్తిత్వ హననం ఉంటుందని మండిపడ్డారు. అద్దం ముందు నిలబడి మీ మనస్సాక్షి ఏం చెపుతోందో వినాలని షర్మిల తెలిపింది. తన తోబుట్టువుల కోసం వైఎస్ ఏం చేశాడో మీకు తెలియదా? అని ప్రశ్నించారు.
వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారని జగన్ ను షర్మిల నిలదీసింది. ఐదేళ్లయినా చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదని ..సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, కలిసి చదువుకున్నామని … న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. రాజకీయాల కోసమో, అధికారం కోసమో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని… వివేకా హంతకులకు శిక్ష పడాలని అన్నారు. చిన్నాన్న శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also : Konda Vijay Kumar : తిరుమల క్షేత్రంలో గోల్డ్‌మ్యాన్ సందడి..అంత గోల్డ్ మాయం