HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sharmila Fire On Jagan 2

Jagan : స్వార్థ రాజకీయాల్లో జగన్ నం.1 – షర్మిల

Jagan : రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల మౌలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, 41 మీటర్ల ఎత్తుతో అది ప్రాజెక్టు కాదని, కేవలం బ్యారేజ్ మాత్రమేనని అన్నారు.

  • Author : Sudheer Date : 28-06-2025 - 8:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagansharmila
Jagansharmila

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) మాజీ సీఎం , వైసీపీ అధినేత , తన అన్న వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ కు ప్రజల గురించి కాకుండా రాజకీయ లాభమే ప్రధానమని ఆమె ఆరోపించారు. “స్వార్థ రాజకీయాల్లో జగన్ నెంబర్ వన్. బీజేపీపై పోరాటం చేయాలంటే వైసీపీకి చిత్తశుద్ధి ఉండాలి. కానీ జగన్ బీజేపీకి ఏమీ అనడం లేదు. రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడే శక్తి కాంగ్రెస్‌దే. పిల్లకాలువలు అన్నీ కాంగ్రెస్ అనే మహాసముద్రంలో కలవాల్సిందే” అని షర్మిల వ్యాఖ్యానించారు.

Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై కూడా షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “సూపర్ ఫ్లాప్‌” అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంలో 93 లక్షల మంది రైతులలో 47 లక్షల మందికే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. మిగతా 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. అదే విధంగా విద్యార్థులకు తల్లికి వందనం, మహిళల మహాశక్తి పథకాలు కూడా కేవలం హామీలకే పరిమితమయ్యాయని, అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆమె మండిపడ్డారు. ఎన్నికల ముందు లింకులు పెడతామన్న పథకాలు కూడా ఇప్పటివరకు అమలుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు.

అలాగే రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల మౌలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, 41 మీటర్ల ఎత్తుతో అది ప్రాజెక్టు కాదని, కేవలం బ్యారేజ్ మాత్రమేనని అన్నారు. కేంద్రం విభజన హామీలను విస్మరిస్తున్నా, రాష్ట్రంలోని ఎంపీలు పాక్షికంగా, రాజకీయ అవసరాలకే మౌనంగా ఉన్నారని విమర్శించారు. బాబు, పవన్, జగన్‌లు బీజేపీకి గులాములుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆమె, రాష్ట్రానికి నిజమైన ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడగలదని, ఇందుకోసం తాము బలంగా ప్రజలతో మమేకం అవుతున్నామని షర్మిల స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • bjp
  • jagan
  • sharmila

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • Case Registered Against You

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd