AP : జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు – వైస్ షర్మిల
షర్మిల ప్రతి మాట వింటుంటే..జగన్ ఆమెకు ఎంత అన్యాయం చేసాడో అర్ధం అవుతుంది
- Author : Sudheer
Date : 08-04-2024 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila)..తన అన్న జగన్ (Jagan) ను అస్సలు వదిలిపెట్టడం లేదు..సభ , సమావేశం ఏదైనా సరే జగన్ ను టార్గెట్ గా చేసుకొని కీలక వ్యాఖ్యలు చేస్తుంది. షర్మిల ప్రతి మాట వింటుంటే..జగన్ ఆమెకు ఎంత అన్యాయం చేసాడో అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఈమె పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ (YSR) పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదని.. భూతద్దం పెట్టి చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడలేదని.. జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన మొత్తం హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని, సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారని.. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.
అలాగే వైఎస్ కుమార్తె సునీత రెడ్డి మాట్లాడుతూ.. మా తండ్రి వివేకా ను హత్య చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. వివేకా హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు. మేము న్యాయం కోసం పోరాటం చేస్తున్నాము. షర్మిల ను ఎంపీ గా చూడాలని వివేకా కోరిక ఈ సందర్భంగా మీరంతా షర్మిలను గెలిపించాలని కోరుకుంటున్న. షర్మిలను ఎంపీగా చూడాలని వివేకా కోరిక.. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని సునీత పేర్కొంది.
Read Also : Pothina Mahesh : కాపు సామాజికవర్గాన్ని ‘పవన్ కళ్యాణ్’ బలి చేస్తున్నారు – పోతిన మహేష్