Rajamouli : సీఎం చంద్రబాబు సెక్రటరీగా మాజీ ఐఏఎస్ అధికారి రాజమౌళి
ఇటీవల కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ అయిన సీనియర్ ఐఏఎస్ రాజమౌళి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
- Author : Latha Suma
Date : 19-07-2024 - 9:11 IST
Published By : Hashtagu Telugu Desk
Rajamouli IAS: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అడుసుమిల్లి రాజమౌళి నియమితులయ్యారు. ఇటీవల కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ అయిన సీనియర్ ఐఏఎస్ రాజమౌళి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే.. ఏపీకి చెందిన రాజమౌళి(Rajamouli) 2003 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రాజమౌళి… సీఎం కార్యదర్శిగా పనిచేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం(TDP Govt) ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్యదర్శిగా వ్యవహరించారు. 2015 నుంచి 2019 వరకు రాజమౌళి సీఎంవోలో పనిచేశారు.