Seaplane : అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లోగా సర్వీసులు షురూ : రామ్మోహన్ నాయుడు
ఏపీలో సీ ప్లేన్ సర్వీసులను(Seaplane) ప్రారంభించాలనే ప్రతిపాదన 2019లోనే వచ్చింది.
- By Pasha Published Date - 11:59 AM, Sat - 9 November 24

Seaplane : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రారంభం కాబోయే సీ ప్లేన్ సర్వీసుల ఛార్జీలు అందరికీ అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మరో 3 నుంచి 4 నెల్లలోగా సీ ప్లేన్ సర్వీసులు ఏపీలో ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 4 రూట్లలో వీటిని నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
Also Read :Kadapa : రేపటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. అభ్యర్థులూ ఇవి గుర్తుంచుకోండి
‘‘ఏపీలో సీ ప్లేన్ సర్వీసులను(Seaplane) ప్రారంభించాలనే ప్రతిపాదన 2019లోనే వచ్చింది. అయితే కొవిడ్ కారణంగా ఆ ప్రతిపాదన వాయిదా పడింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో ఏపీకి సీప్లేన్ ప్రాజెక్టు మంజూరైంది. రాష్ట్రంలో ఇక సీ ప్లేన్ సర్వీసులు నడుపుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం మరింత పెరగడానికి సీప్లేన్ సర్వీసులు బాగా దోహదం చేయనున్నాయి’’ అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
Also Read :H Pylori Infection : అమ్మ చేతి గోరు ముద్దతో హెచ్. పైలోరీ బ్యాక్టీరియా వ్యాప్తి.. ఏమిటిది ?
‘‘చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నేను కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి అయ్యాను. చంద్రబాబు నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు. సివిల్ ఏవియేషన్ అంటే అందరూ ఎయిర్ పోర్టులలో కనిపించే ప్లేన్లు అని అనుకుంటారు. కానీ అంతకంటే ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. ఏవియేషన్ రంగంలో ఉన్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా పనిచేయాలని నాకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన మార్గదర్శనం మేరకు నేను పనిచేశాను. విమానయాన సంస్థల ప్రతినిధులు, నిపుణులతో చర్చించి సీ ప్లేన్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన అన్ని విధివిధానలను రెడీ చేశాం’’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్దనున్న పున్నమి ఘాట్‌కు సీ ప్లేన్ చేరుకుంది. కాసేపట్లో బ్యారేజీ నుంచి శ్రీశైలం దాకా సీ ప్లేన్‌లో సీఎం చంద్రబాబు ప్రయాణించనున్నారు. ఈనేపథ్యంలో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14 మంది కూర్చునేలా సీ ప్లేన్‌లో సీటింగ్ ఏర్పాట్లు చేశారు.