HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sankranti Holidays For Schools In Ap Finalized

ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు

జనవరి 18 (శనివారం) వరకు సెలవులు ముగియనున్నాయి. జనవరి 19న ఆదివారం కావడంతో, తిరిగి జనవరి 20వ తేదీ (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

  • Author : Sudheer Date : 26-12-2025 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Half Day Schools
Half Day Schools
  • ఆంధ్రాలో అంబరాన్ని తాకనున్న సంక్రాంతి సంబరాలు
  • సంక్రాంతి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ , ప్రవైట్ స్కూల్స్ కు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. 2026 సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను అధికారికంగా ఖరారు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, అంటే మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఉండే ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కుటుంబాలతో కలిసి పండుగను జరుపుకోవడానికి వీలుగా ఈ సుదీర్ఘ సెలవులను ప్రకటించారు. ఈ ప్రకటనతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు పండుగ ప్రయాణాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

School Holidays

School Holidays

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 18 (శనివారం) వరకు సెలవులు ముగియనున్నాయి. జనవరి 19న ఆదివారం కావడంతో, తిరిగి జనవరి 20వ తేదీ (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం జనవరి 19న పాఠశాలలు తెరుస్తారని భావించినప్పటికీ, అది ఆదివారం కావడంతో సోమవారం నుంచే రెగ్యులర్ తరగతులు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజీల సెలవులకు సంబంధించి ఉన్నత విద్యామండలి నుంచి ప్రత్యేక ఉత్తర్వులు రావాల్సి ఉంది. సాధారణంగా స్కూళ్లతో పోలిస్తే కాలేజీలకు సెలవుల సంఖ్య ఒకటి రెండు రోజులు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన తేదీలనే (జనవరి 10 – 18) తెలంగాణలోనూ అనుసరించే అవకాశం మెండుగా ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పండుగ సంప్రదాయాలు, ప్రయాణ సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఏకరీతిగా సెలవులు ఇచ్చే సంప్రదాయం ఉంది. తెలంగాణలో ఒకవేళ సెలవుల షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉంటే, అది ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి సంక్రాంతిని సుదీర్ఘ సెలవులతో ఎంజాయ్ చేయబోతున్నారన్న మాట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 Sankranti holidays
  • ap govt
  • Sankranti
  • Sankranti Holidays
  • Sankranti holidays ap govt schools
  • schools

Related News

Anna Canteens

ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్.. సంక్రాంతికి గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు!

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేయనుండగా, జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది

  • Unified Family Survey

    ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

  • Pulse Polio Programme

    నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • Pulse Polio Dec21

    రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • Lokesh Foreign Tour

    ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

Latest News

  • చలికాలంలో ఎందుకు ఎక్కువగా గుండెపోటు వస్తుందో తెలుసా ?

  • రంగంలోకి దిగిన పవన్ , భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు

  • నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం , నలుగురు మృతి

  • ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు

  • రైలు ప్రయాణికులపై నేటి నుండి చార్జీల బాదుడు షురూ !

Trending News

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

    • 2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతుంది?!

    • శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జ‌ట్టులోకి పునరాగమనం?

    • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd