HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Akhanda 2 Thaandavam Shooting Update

Akhanda: హిమాలయాల్లో అఖండ పోరు.. ఈ సారి కూడా హిట్ గ్యారెంటీ అంటూ!

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరిగనుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author : Anshu Date : 02-03-2025 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akhanda 2
Akhanda 2

టాలీవుడ్ నందమూరి హీరో బాలయ్య బాబు ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు. సీనియర్ హీరో అయినా బాలకృష్ణ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు సినిమాలతో ఒకదాని తర్వాత ఒకటి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాను రామ్ ఆచంట గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సంయుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌ లో ఒక కీలక షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. కాగా తదుపరి కొత్త షెడ్యూల్‌ ను ఈ నెల రెండో వారం నుంచి హిమాలయాల్లో చిత్రీకరించేందుకు బోయపాటి సిద్ధమవుతున్నారట. అయితే అందుకోసం ప్రస్తుతం ఆయన హిమాలయాల్లోని పలు అందమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారట. ఈ షెడ్యూల్‌ లో బాలయ్యకు సంబంధించిన అఖండ పాత్రపై కీలక సన్నివేశాలతో పాటు ఒక భారీ పోరాట ఘట్టాన్ని కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనువిందు చేయనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఇందులో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబరు 25 న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్బంగా సినిమాను పూర్తి చేసి ప్రొమోషన్స్ కార్యక్రమాలను బాగా నిర్వహించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akhanda
  • Akhanda 2
  • Akhanda movie
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

    • Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

    • Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd