RTC Bus Mishap : విజయవాడ బస్టాండ్ లో బస్సు బీభత్సం….ముగ్గురు మృతి
సోమవారం ఉదయం విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా 12 నెం ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది
- Author : Sudheer
Date : 06-11-2023 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
సోమవారం ఉదయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (Vijayawada RTC Bus Stand) లో బస్సు బీభత్సం (RTC Bus Mishap) సృష్టించింది. 12 ప్లాట్ ఫామ్ ముందు ఆగాల్సిన ఓ ఏసీ బస్సు.. అదుపు తప్పి ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో ప్లాట్ ఫామ్ ఫై ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ఫై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యిందని భావించిన , ఆ తర్వాత డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ముందు గేర్ వేయడం తో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Vjd Rtc
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం ఉదయం విజయవాడలోని ఆటోనగర్ డిపో (Auto Nagar Depot)కు చెందిన బస్సు గుంటూరు (Guntur)కు వెళ్లాల్సి ఉండగా 12 నెం ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం. బస్సు ప్రమాద ఘటనతో చుట్టు పక్కల నిలబడి ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బస్సు కింద నలిగిపోతున్న ప్రయాణికుల్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Authentic Person : ఫేక్ వ్యక్తులు, ఆథెంటిక్ వ్యక్తులను గుర్తించడం ఇలా..