Authentic Person : ఫేక్ వ్యక్తులు, ఆథెంటిక్ వ్యక్తులను గుర్తించడం ఇలా..
Authentic Person : నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే వ్యక్తులను ఇష్టపడని వారు ఎవరుంటారు.
- By Pasha Published Date - 10:21 AM, Mon - 6 November 23
Authentic Person : నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే వ్యక్తులను ఇష్టపడని వారు ఎవరుంటారు. అలాంటి వారినే అందరూ ఇష్టపడతారు. మీరు నిజాయితీగా ఉన్నారంటే.. అన్ని సమయాలలోనూ, అన్నిచోట్లా ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. కానీ కొందరు ఒక సమయంలో ఒకలా.. ఒక్కోచోట ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు కొన్ని సంకేతాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
1.ప్రవర్తన అస్థిరం
ప్రవర్తనను ఎప్పటికప్పుడు మార్చుకునే వాళ్లను నమ్మలేం. వాళ్లు పైకి ఒకలా.. లోపలి నుంచి మరోలా ఉంటారు. వారి మాటలను కూడా నమ్మలేం. అసలైన వ్యక్తులు ఎక్కడ ఉన్నా ఒకేలా ఉంటారు. ఒక్కోచోట ఒక్కో విధంగా మాట్లాడే వాళ్లపై నమ్మకాన్ని కాస్త తగ్గించుకోవడమే బెటర్. అలాంటి వారిపై ఏవిషయంలోనూ ఆధారపడటం సరికాదు. ముఖ్యమైన పనుల బాధ్యతలు అలాంటి వారికి(Authentic Person) ఇవ్వొద్దు.
2.నో ఫీలింగ్
నిజంగా నిజాయితీ కలిగిన వ్యక్తులు ఇతరుల ఫీలింగ్స్‌ను త్వరగా అర్థం చేసుకుంటారు. బాగా అర్థం చేసుకుంటారు. వెంటనే సానుభూతిని ప్రకటిస్తారు. ఎవరైనా బాధలో, కష్టంలో ఉంటే నైతిక స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. ఇవి లేని వారిని అనుమానించవచ్చు. ఇతరుల బాధను.. తన బాధగా భావించే వారు నిజమైన నిజాయితీపరులు. ఇతరుల సాధకబాధకాలను అర్థం చేసుకోకుండా ఏకాకిగా, స్వార్థంతో జీవించేందుకు ఇష్టపడేవారిని అంత ఈజీగా నమ్మొద్దు.
3.పర్సనల్ లిమిట్స్‌కు బ్రేక్
నిజంగా ఆథెంటిక్‌గా ఉండేవారు ఇతర వ్యక్తుల వ్యక్తిగత లిమిట్స్‌ను అర్థం చేసుకుంటారు. వారి ఆలోచనలను గౌరవిస్తారు. ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండేందుకు.. లిమిట్స్‌ను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమనేది వారికి బాగా తెలుసు. ఎవరైనా లిమిట్స్‌ను అర్థం చేసుకోకుండా మీతో ప్రవర్తిస్తే.. వారు ఆథెంటిక్ పర్సన్ కాదని ఐడెంటిఫై చేయండి. మీ హక్కులను, మీ ఆలోచనలను, మీ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోని వారితో అలర్ట్‌గా ఉండండి.
4.తప్పులను అంగీకరించరు
ఆథెంటిక్‌గా ఉండేవారు తాము ఏదైనా తప్పు చేస్తే దాన్ని అంగీకరించేందుకు వెనుకాడరు. ఆ తప్పు ఎలా జరిగిందో కూడా చెబుతారు. కానీ ఫేక్ పర్సన్స్ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నంలోనే బిజీగా ఉంటారు. ఎన్నిసార్లు తప్పు చేసినా వారిలో మార్పు అనేది కనిపించదు. చేసిన తప్పును అంగీకరించే స్వభావం వారిలో ఉండదు. అవసరమైతే ఇలాంటి ఫేక్ పర్సన్స్ నిజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. నిత్యం ఇతరులను నిందిస్తూ ఉంటారు. తామే సరైన వాళ్లమని నిరూపించుకోవడం అనేది ఫేక్ పర్సన్స్‌లో స్పష్టంగా కనిపించే లక్షణం.
5.నిర్దయ, అన్యాయం
ఆథెంటిక్‌గా ఉండేవాళ్లు తాము కోరుకున్నది పొందే క్రమంలో న్యాయం, దయలకు కూడా చోటు ఇస్తారు. జీవితంలో లేదా వ్యాపారంలో లేదా కెరీర్లో విజయం సాధించే ప్రయత్నంలో ఇతరులతో అన్యాయంగా వ్యవహరించరు. ఇతరులను బాధపెట్టగా, నష్టం కలిగించగా వచ్చే గెలుపును ఆథెంటిక్ పర్సన్స్ ఇష్టపడరు. కానీ ఫేక్ పర్సన్స్ ఇతరుల బాధలను లెక్క చేయకుండా గెలుపును కోరుకుంటారు. తమ జీవిత సౌఖ్యం కోసం ఇతరులకు చేటు జరిగినా ఫర్వాలేదు అనుకుంటారు. ఇలాంటి వాళ్లు డేంజర్. ఇటువంటి స్వభావంతో కనిపించే వారితో అప్రమత్తంగా ఉండాలి.
6.అబద్ధాల అలవాటు
ఆథెంటిక్ పర్సన్స్ అబద్దాలతో ఇతరులను మోసగించరు. తమకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినా నిజమే మాట్లాడుతారు. నమ్మకం, నిజాయితీని నిలబెట్టుకోవడమే వారి ఏకైక లక్ష్యంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తరుచుగా అబద్ధాలు చెబుతుంటే వాళ్లు ఆథెంటిక్ కానే కాదని ఐడెంటిఫై చేయండి. ఇతరులను అబద్ధాలతో మోసగించే ప్రయత్నం చేసేవారు చాలా డేంజర్. వారి వల్ల అపాయం కలిగే ముప్పు ఎక్కువ. ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మకపోవడమే బెటర్.
Also Read: Tummala vs BRS : పూజకు పనికి రాని పువ్వు “పువ్వాడ” .. కేసీఆర్‌కి మంత్రి పదవి ఇప్పించ్చింది తానేనన్న తుమ్మల
Related News
Soulmate Signs : మీ లవర్ ఆత్మీయుడా ? కాదా ? 6 సంకేతాలు
Soulmate Signs : ప్రేమలో పడటం ఒక ఎత్తు. ఆత్మీయుడిగా మెలిగే వ్యక్తితో ప్రేమలో పడటం మరో ఎత్తు.