Roja – Bandla Ganesh : బండ్ల గణేష్ ఓ ‘సెవన్ ఓ క్లాక్’ అంటూ రోజా సెటైర్లు
- Author : Sudheer
Date : 29-02-2024 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఓ ‘సెవన్ ఓ క్లాక్’ ( 7 o’Clock) అంటూ వైసీపీ మంత్రి రోజా (Minister Roja) సెటైర్లు వేశారు. రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ మాట్లాడుతూ..రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రోజా..రేవంత్ ఫై పలు కామెంట్స్ చేయడం తో రోజా ఫై గణేష్ మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
రోజా కాదు ఆమె డైమండ్ రాణి..ఆమెకు ఈసారి సీటు వస్తుందో రాదో..రేవంత్ రెడ్డి యాక్స్డెంటల్ సీఎం కాదు..జగన్ యాక్స్డెంటల్ సీఎం ..రేవంత్ పోరాట యూదుడు .ఫైటర్ అంటూ గణేష్ ప్రశంసలు కురిపించారు.భారతదేశంలో రేవంత్ లాంటి యూదుడు చాల తక్కువ మంది ఉంటారు..ఆ తక్కువ మందిలో ఒక్కరు రేవంత్.పోరాడి , కష్టపడి తానేంటో రుజువు చేసుకొని సీఎం అయ్యారు. నాన్న చనిపోతేనే ..నాన్న వారసత్వంగానో సీఎం కాలేదు. పులుసు వండిపెట్టింది కాబట్టే రోజా పులుసు పాప అయ్యిందంటూ గణేష్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. రేపోమాపో మాజీ అయ్యాక..జబర్డస్త్ ప్రొగ్రమ్స్ చేసుకోవాలని గణేష్ సూచించారు.
తనపై బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా మంత్రి రోజా సెటైర్లు వేశారు. బండ్ల గణేశా.. ఎవరతను? సెవన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకుని చచ్చిపోతాను అన్నాడు అతనేనా? వాళ్ల గురించి ఏం చెప్తాం’ అంటూ తనదైన స్టయిల్ లో విమర్శించారు. ఒక మహిళ రాజకీయాల్లో ఎదుగుతుంటే కొందరు నీచంగా మాట్లాడుతుంటారని , టీడీపీ, జనసేన వాళ్లకు అది వెన్నతో పెట్టిన విద్య అని.. అందుకే వాళ్లను మహిళలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. మరి దీనిపై గణేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read Also : Most Powerful Indians : అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రేవంత్ రెడ్డి