HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Road Accident In Kuppam

3 Killed : ఏపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మెడిక‌ల్ విద్యార్థులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మెడికోలు మృతి చెందినట్లు

  • Author : Prasad Date : 27-02-2023 - 7:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మెడికోలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుప్పం పట్టణ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొనడంతో ట్రక్కు కిందపడి ఈ ప్రమాదం జరిగింది. కుప్పం శివారులోని సెట్టిపల్లె గ్రామంలోని పలమనేరు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఈఎస్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు తమ క్లాస్‌మేట్ వివాహానికి హాజరయ్యేందుకు కుప్పం పట్టణానికి వెళుతున్నారు. కారు సెట్టిపల్లె గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. మెడికోలు ప్రయాణిస్తున్న కారు పలుమార్లు బోల్తా పడి రోడ్డుకు అవతలివైపు ల్యాండ్ అయి, ఎదురుగా వస్తున్న లారీ కింద పడింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని వికాస్, కళ్యాణ్ (హౌస్ సర్జన్లు), మూడో సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌గా గుర్తించారు.

పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కారులోంచి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ‌ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు వైద్యాధికారుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమని నాయుడు అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • kuppam
  • Medico died
  • PES hospital
  • road accident

Related News

Telangana government good news for Anganwadi helpers

Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంధ్యా రాణి ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ఆయా (అంగన్వాడీ హెల్పర్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

Latest News

  • Hyderabad : హైదరాబాద్‌లోని పేదలకు గుడ్‌న్యూస్

  • AI : ప్రాజెక్ట్ రంగంలో ‘ఏఐ విప్లవం’

  • Trump Tariffs : టారిఫ్లపై ట్రంప్ కీలక ప్రకటన

  • AC Price Hike : ఏసీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • Rape : బాలికను అత్యాచారం చేసిన జ్యోతిషుడు

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd